Begin typing your search above and press return to search.
కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టులో ఏముంది... ఏపీలో గెలిచేది ఎవరు...?
By: Tupaki Desk | 6 April 2023 7:00 AM GMTఏపీలో ఒక్క సీటూ కనీసంగా ఓటు బ్యాంక్ లేకపోయినా బీజేపీ కన్ను మాత్రం ఇటు వైపే ఉంది. బీజేపీకి ఏపీ కావాలి. ఏపీలోని ఎంపీలు కావాలి. పార్టీలతో అసలు సంబంధం లేదు. ఎవరు గెలిచినా కూడా సంబంధం లేదు. ఇది పక్కా. అయితే కేంద్ర బీజేపీ పెద్దలు టీడీపీ వైపా వైసీపీ వైపా అన్నది ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు అన్నదే కీలకమైన పాయింట్.
నిజానికి కేంద్ర బీజేపీ పెద్దలకు జగన్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు. అదే సమయంలో చంద్రబాబు మీద ద్వేషం అంతకంటే లేదు అంటున్నారు. కానీ జగన్ తో పోలిస్తే చంద్రబాబుతోనే జాతీయ స్థాయిలో కొంచెం ఇబ్బంది అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో తలపండిన వారు. ఇప్పటికి మూడు దశాబ్దలా క్రితమే చక్రం తిప్పి బీజేపీని దూరంగా పెట్టిన్ అన్ని పార్టీలను ఒక చోట చేర్చి యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసిన వారు.
ఆ సమయంలో అమిత్ షా ఎక్కడున్నారో తెలియదు, మోడీ అయితే బీజేపీలో లేరు, సంఘ్ సేవకుడిగా ఉన్నారు. ఇక చంద్రబాబు బీజేపీతో కలసి ఎన్డీయే కన్వీనర్ గా కీలకంగా ఉన్న రోజున మోడీ గుజరాత్ కి ఫస్ట్ టైం సీఎం గా ఉన్నారు. ఆ టైం లోనే గోద్రా అల్లర్లు జరగడంతో బాబు మోడీని తప్పించమని నాటి ప్రధాని వాజ్ పేయి వద్ద డిమాండ్ పెట్టారన్నది తెలిసిందే.
ఇక 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున బాబు 2018 నాటికి విడిపోయారు. ఆ సమయంలో మోడీ మీద వ్యక్తిగతంగా బాబు విమర్శలు చేశారు, అలాగే అమిత్ షా నాడు తిరుపతికి వస్తే ఆయన కారు మీద తెలుగుదేశం పార్టీ వారు రాళ్లేశారు. ఇలాంటి విషయాలు రాజకీయాల్లో పెద్దగా ఎవరూ పట్టించుకోరు అని అంటారు కానీ మోడీ అమిత్ షాలు మాత్రం తమకు జరిగినవి ఎపుడూ మరచిపోరు అనే చెబుతారు
అలా టీడీపీతో పొత్తుకు కొంత ఆటంకం గా ఉంది అంటున్నారు. అయినా సరే పొత్తుకు బీజేపీ రెడీ అయితే రేపటి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆయన చూపు వెంటనే జాతీయ రాజకీయాల్లోనే ఉంటుందని అంటున్నారు. 2014, 2019లలో పూర్తి మెజారిటీ వచ్చిన బీజేపీకి ఈసారి మెజారిటీ పెద్దగా రాదు అని సర్వేలు ఘోషిస్తునాయి. మహారాష్ట్ర, కర్నాటక, బీహార్ సహా కొన్ని కీలక రాష్ట్రాలలో బీజేపీకి సీట్లు ఈసారి బాగా తగ్గుతాయని అంటున్నారు. అలా ఒక యాభై అరవై సీట్లు తగ్గినా చాలు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దూరం అవుతుంది.
ఆ టైం లో కనుక బాబు ఏపీలో అధికారంలో ఉంటే ఆయన చాలా సులువుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పి నాన్ బీజేపీ ఫ్రంట్ ని కేంద్రంలో అధికారంలోకి తీసుకురాగలరు అన్న బెంగ కలవరం అయితే బీజేపీ పెద్దలలో నిండుగా ఉందిట. అందుకే తమ మిత్రపక్షం జనసేన నుంచి ఎంతగా వత్తిడి వచ్చినా టీడీపీ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుని నమ్మలేమన్న భావంతోనే కేంద్ర పెద్దలు ఉన్నారని అంటున్నారు.
ఇక మూడవ కారణం ఏంటి అంటే కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఏపీలో రాజకీయ పరిస్థితుల మీద చేసిన సర్వేలలో సైతం వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందని అంటున్నారు. గతంలో వచ్చిన 151 సీట్లు తగ్గినా మళ్ళీ వైసీపీ అధికారం నిలబెట్టుకుంటుందని కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయని ప్రచారం సాగుతోంది. దాంతోనే బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇక చివరిగా చూస్తే బీజేపీకి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం సుతరామూ ఇష్టం లేదు.ఎందుకంటే బాబు మళ్లీ పవర్ లోకి వస్తే కచ్చితంగా మరో పదేళ్ల పాటు కుదురుకుంటారని, ఈసారి ఆయన వారసుడు కూడా రెడీగా ఉన్నందువల్ల ఏపీలో బీజేపీకి ఎలాంటి స్కోప్ ఉండదని భావిస్తున్నారుట. అదే వైసీపీ ఈ తడవ అధికారంలోకి వస్తే 2029 నాటికి తెలుగుదేశం పూర్తిగా నిర్వీర్యం అయి బీజేపీకి పూర్తి సానుకూలత ఉంటుందని కూడా గట్టి నమ్మకంతో ఉన్నారట. మొత్తానికి కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికలలలో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.