Begin typing your search above and press return to search.

మోడీ జాతకంలో ఏముంది? త్వరలో ఆయనకొచ్చే కష్టాలేంటి?

By:  Tupaki Desk   |   21 Oct 2020 11:50 AM GMT
మోడీ జాతకంలో ఏముంది? త్వరలో ఆయనకొచ్చే కష్టాలేంటి?
X
జాతకాల్ని.. కర్మల్ని బలంగా నమ్మేవారు ఉన్నట్లే.. అదొట్టి ట్రాష్ అని తేల్చేసేటోళ్లు తక్కువేం కాదు. అలాంటి వారి వాదనలు ఎలా ఉన్నా.. కోట్లాది మంది నమ్మకాన్ని చూరగున్న జ్యోతిష్యం లోతుల్లోకి వెళితే.. ఒక సైన్స్ కనిపిస్తుంది. ఏదో నోటికి వచ్చినట్లు చెప్పటం కాకుండా.. గ్రహాలు.. నక్షత్రాల ఆధారంగా విశ్లేషణ ఉంటుంది. కాలమాన పరిస్థితులకు తగ్గట్లు వర్తమానం ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాలతో పాటు.. గడిచిన గతాన్ని కూడా కళ్లకు కట్టినట్లుగా చెప్పేవాళ్లు చాలామంది కనిపిస్తారు.

మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. ప్రధాని మోడీ జాతకం ఇప్పుడెలా ఉంది? ఆయన ఏ దశలో ఉన్నారు? రానున్న రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా ఉండనుంది? త్వరలో ఆయనకు ఎదురయ్యే సమస్యలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర సమాచారం వస్తుంది. మోడీ జాతకాన్నిసింఫుల్ గా చెప్పాలంటే.. గుజరాత్ లోని మేహసానా జిల్లాలోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబరు 17న ఉదయం పదకొండు గంటలకు జన్మించారు. ఆయన పుట్టిన సమయం ఆధారంగా చూస్తే..అనురాధ నక్షత్రం రెండోపాదంలో ఆయన జన్మించారు.

శని మహర్దశలో.. శుక్రుడి అంతర్ధశలో ఆయన జీవితం షురూ అయ్యింది. ఈ కారణంతోనే ఆయనకు మూడు అద్భుతమైన యోగాలు ఆయనకు ఉన్నట్లుగా చెబుతారు. అందులో చాలా తక్కువమందికి ఉండే.. గజకేసరి యోగం ఆయన జీవితాన్ని ఉన్నత స్థానాలోకి తీసుకెళ్లినట్లుగా చెప్పాలి. మోడీ జాతకాన్ని చూస్తే.. బాల్యమంతా కష్టాలతో నిండినట్లుగా కనిపిస్తుంది. కారణం.. మోడీ జీవితం శని మహాదశతోనే ప్రారంభం కావటం. బుధుడు ఉచ్చ స్థానంలో ఉననా.. కేతువుతో ఉండటం వల్ల చదువు ఆటంకాలతోనే ముందుకు సాగింది. 1961లో శని మహాదశ ముగిసింది. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగినట్లుగా చెబుతారు.

తర్వాత మొదలైన బుధ మహాదశ ఏకంగా 17 ఏళ్లు.. తర్వాత స్టార్ట్ అయిన శుక్ర మహర్దశ ఏకంగా 20 ఏళ్ల పాటు ఉండటంతో రాజకీయంగా కీలక పదవులు చేపట్టే అవకాశం లభించిందని చెబుతారు. మోడీ జాతకంలో మరో విశేషం ఏమంటే.. ఆయన ఏలినాటి శని దశలోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నిజానికి ఏలినాటి శని అన్నంతనే.. చాలామంది భయపడిపోతారు. కానీ.. ఇలాంటి దశలోనూ దేశ ప్రధాని స్థానాన్ని చేపట్టే యోగం కూడా ఉంటుందన్న విషయం మోడీ జాతకాన్ని చూస్తే అర్థమవుతుంది. గతం.. వర్తమానం ఓకే. మరి.. భవిష్యత్తు మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఇట్టే చెప్పేస్తున్నారు పలువురు జ్యోతిష్య నిపుణులు.

ప్రస్తుతం గోచార రీత్యా వృశ్చిక రాశిలో కేతువు ఉన్నాడు. ఏడాదిన్నర పాటు కేతువు.. చంద్రుడితో ఉండనున్నాడు. ఈ కారణంగానే రానున్న రోజుల్లో మోడీ తల్లి ఆరోగ్యం బాగుండదు. మోడీ జాతకంలో ఇబ్బందికర పరిస్థితులు లేవు. పూర్వ పుణ్యబలం ఎక్కువగా ఉన్న మోడీ.. రాజకీయంగా తిరుగులేని శక్తి మరికొంత కాలం కొనసాగటం ఖాయమంటారు.