Begin typing your search above and press return to search.
గూడూరు లో ఎమ్మెల్సీ హవా.. ఎమ్మెల్యే సైలెంట్.. రీజనేంటి?
By: Tupaki Desk | 25 Jun 2023 5:00 AM GMTఉమ్మడి నెల్లూరు జిల్లా లోని గూడూరు నియోజకవర్గం ఎస్సీవర్గానికి కేటాయించారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ విజయం దక్కించుకున్నారు. 2014లో ఆయన తిరుపతి నుంచి ఎంపీ గా విజయం దక్కించుకున్న తర్వాత.. అనూహ్యంగా ఆయనను జగన్ గూడూరు కు తరలించారు. ఇక్కడ కూడా విజయం ఆయన ను వరించింది. అయితే.. రాజకీయం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా!
ఇప్పుడుఇదే పరిస్థితి వరప్రసాద్ విషయం లోనూ కనిపిస్తోందని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బల్లి కళ్యాణచక్రవర్తి..గూడూరు నియోజకవర్గంలో జోరు గా రాజకీయాలు చేస్తున్నారు. బల్లి కుటుంబానికి ఇక్కడ మంచి కేడర్ ఉంది. గతం లో కళ్యాణ చక్రవర్తి తండ్రి దుర్గా ప్రసాద్ టీడీపీ తరఫున గూడురు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. తర్వాత వైసీపీ కి మారి 2019లో తిరుపతి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
అయితే.. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నిక లో డాక్టర్ గురుమూర్తి విజయం దక్కించుకు న్న తర్వాత.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే తిరుపతి పార్లమెంటు సీటు ను ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే బల్లి కళ్యాణ చక్రవర్తి ని ఎమ్మెల్సీ గా పంపించారు. కానీ, ఈయన మనసు మాత్రం.. తన తండ్రి స్థానమైన గూడూరు పైనే ఉంది. దీంతో విందు సమావేశాలు ఏర్పాటు చేసి.. తన కేడర్ సడలి పోకుండా చూసుకుంటున్నారు.
అంతేకాదు.. గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఆయన గూడూరు లోనే చేపడుతున్నారు. దీనిని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ ఆపాల ని చూసినా.. ఆయన సొంత నియోజకవర్గం కాకపోవడంతో మౌనంగా ఉంటున్నారు. పోనీ.. తానే స్వయంగా కార్యక్రమాలు చేపడుతున్నా.. బల్లి వర్గం.. నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు.
దీంతో ఇక, తనకు టికెట్ గల్లంతేనని ఒక నిర్ణయానికి వచ్చిన వరప్రసాద్ పక్క చూపులు చూస్తన్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ.. టికెట్ ఇస్తే.. ఆ పార్టీల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా జగన్ నిర్వహించిన ఎమ్మెల్యే ల సమావేశానికి వరప్రసాద్ అనారోగ్య కారణాలు చూపించి ఎగ్గొట్టడం విశేషం.