Begin typing your search above and press return to search.
ఢిల్లీలో ఏమి జరుగుతోంది ?
By: Tupaki Desk | 15 Dec 2020 5:30 AM GMTఇపుడిదే అంశం తెలుగురాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీకి వెళుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళుతున్న జగన్ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవబోతున్నారు. నిజంగా జగన్ ఢిల్లీ పర్యటన హఠాత్తుగా ఫిక్సయ్యిందనే అంటున్నారు. మరి జగనే అపాయింట్మెంట్ కోరారో ? లేకపోతే అమిత్ షా యే రమ్మన్నారో తెలీదు. ఇంతకుముందు కూడా జగన్ మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేసి అమిత్ షా ను రెండుసార్లు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా కలిసిన విషయం తెలిసిందే.
దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో ఓ విధంగా పరాజయం అయిన వెంటనే కేసీయార్ కూడా ఢిల్లీలోనే మూడు రోజుల మకాం వేసిన విషయం తెలిసిందే. కేసీయార్ ఢిల్లీ పర్యటన కూడా హఠాత్తుగా ఫిక్సయ్యిందే. ఢిల్లీ పర్యటనలో కేసీయార్ కూడా ముందు అమిత్ షాతో భేటీ అయ్యారు, పనిలో పనిగా ఇతర కేంద్రమంత్రులను కూడా కలిశారు. చివరగా ప్రధానమంత్రితో 45 నిముషాలు భేటీ అయి హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. కేసీయార్ ఢిల్లీ నుండి వచ్చేయగానే జగన్ ఢిల్లీకి వెళుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు వెంట వెంటనే ఢిల్లీకి హఠాత్తుగా ప్రయాణం కట్టడమే ఇక్కడ విచిత్రంగా ఉంది. తెరవెనుక ఏదో జరుగుతోంది కాబట్టి ఇద్దరు సీఎంలు ఇంత హఠాత్తుగా ఢిల్లీ బాట పట్టారని రాజకీయాల్లో చర్చలు పెరిగిపోతున్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో పెరిగిపోతున్న ఉద్యమం కారణంగా కేంద్రానికి ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ విషయం మాట్లాడేందుకు అయితే సీఎంలను ఢిల్లీకి పిలిపించక్కర్లేదు. ఇదే విషయాన్ని ఫోన్లో మాట్లాడినా సరిపోతుంది. ఎలాగూ జగన్ నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
ఉత్తరాధిలో వీకైపోతున్న ఎన్డీయేకి దక్షిణాదిన నమ్మకస్తులైన కొత్త మద్దతుదారుల కోసం మోడి వెతుకుతున్నారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. మరి ఇందులో భాగంగానే ఇద్దరు సీఎంలతో చర్చించేందుకు పిలిపించారా అనే చర్చ మొదలైంది. అయితే ఇందులో కేసీయార్ ను ఎంతవరకు నమ్మవచ్చన్నది పెద్ద ప్రశ్న. ఇక జగన్ ఎలాగు అంశాల వారీగా కేంద్రానికి మద్దతిస్తునే ఉన్నారు. కాకపోతే ఎన్డీయేలో చేర్చుకోవాలంటే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం నెరవేర్చాల్సుంటుంది. మరి తెరవెనుక జరుగుతున్న విషయాలు ఎప్పటికి బయటపడతాయో చూద్దాం.