Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో ఏం జ‌రుగుతోంది.. కేంద్రం ఆరా.. ఆ నేత‌ల‌కు షాకిస్తారా..!

By:  Tupaki Desk   |   30 March 2023 10:39 AM GMT
ఏపీ బీజేపీలో ఏం జ‌రుగుతోంది..  కేంద్రం ఆరా.. ఆ నేత‌ల‌కు షాకిస్తారా..!
X
ఔను. ఏపీ బీజేపీలో ఏం జ‌రుగుతోంది? ఏయే నాయ‌కులు ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌పై తాజాగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఆరా తీసిన‌ట్టు తెలిసింది. కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లో సిట్టింగ్ బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వ్ ప‌రాజ‌యం పాల‌వ‌డం.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాహుల్ గాంధీకి వ్య‌తిరేకంగా బీజేపీ ఉద్య‌మించడం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ బీజేపీ నేత‌లు ఆశించిన విధంగా స్పందించ‌క‌పోవ‌డంపై ఆరా తీస్తున్నారు.

కొంద‌రు ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు వ్య‌తిరేకంగా.. నివేదిక‌లు స‌మ‌ర్పించారు. ఆయ‌న‌ను మార్చి తీరాల్సిందేన‌ని.. సీమ‌కు చెందిన ఇద్ద‌రు ఎంపీలు ఏకంగా.. సంత‌కాలు చేసి మ‌రీ బీజేపీ అధిష్టా నానికి నివేదిక‌లు పంపించారు.

వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న బీజేపీ కేంద్ర పెద్ద‌లు.. ఏపీలో కేవ‌లం సోము కేంద్రంగా నాయ‌కుల మ‌ధ్య వివాదాలు ఏర్ప‌డుతున్నాయా? అనే కోణంలోనూ ప‌రిశీల‌న చేస్తున్నారు.

వీటికితోడు.. ఇటీవ‌ల క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా పార్టీ మారిపోయారు. ఇవ‌న్నీ కూడా కేవ‌లం 20 రోజుల వ్య‌వ‌ధిలోనే చోటు చేసుకోవ‌డం.. ముఖ్య‌నేత‌లుగా కేంద్ర పార్టీ గుర్తించిన పురందేశ్వ‌రి.. నుంచి సీఎం ర‌మేష్‌.. సుజనా చౌద‌రి వ‌ర‌కు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం.. సోముకు మ‌ద్ద‌తుగా లేక‌పోవ‌డం వంటివాటిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు.ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో జేపీ న‌డ్డా ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని.. నాయ‌కుల‌కు వ‌ర్త‌మానం అందింది.

ఈ క్ర‌మంలో ఏపీలో భారీ మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని.. అస‌లు చేరిక‌లు లేకపోగా.. ఉన్న నాయ‌కులు కూడా ఓడిపోవ‌డం.. పార్టీలు మారిపోవ‌డం.. ఏ విష‌యంపైనా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోవ‌డం వంటి అంశాల‌ను.. పార్టీ అధిష్టానం సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు స‌మాచారం.

అయితే, సోముకు మార్పు ఉండ‌ద‌ని.. ఆయ న చెప్పిన‌ట్టు వినాల‌ని.. పార్టీ అధిష్టానం అన్నీ గ‌మ‌నిస్తోంద‌ని.. ఇప్ప‌టికే సంకేతాలు పంపిన నేప‌థ్యంలో న‌డ్డా ప‌ర్య‌ట‌న మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.