Begin typing your search above and press return to search.
బండి సంజయ్ అరెస్ట్ చుట్టూ అసలేం జరుగుతోంది?
By: Tupaki Desk | 5 April 2023 3:34 PM GMTవరంగల్ లో జరిగిన పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఈ కేసులో ఓ జర్నలిస్ట్ ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో అతడు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు కాల్ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ కేసులో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పక్కా ఆధారాలు సేకరించినట్టుగా చెబుతున్న పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న కారణాలను మాత్రం పోలీసులు ఆయనకు మీడియాకు ఇప్పటివరకూ తెలుపలేదు. బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ‘బొమ్మలరామారం' పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు, బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
-ప్రశాంత్ అరెస్ట్ తర్వాత బండి అరెస్ట్
వాట్సప్‌లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని సమాచారం. ఈయన మాజీ జర్నలిస్ట్ అని కూడా చెబుతున్నారు. ప్రశాంత్ ద్వారానే సంజయ్‌కు ప్రశ్నపత్రం చేరిందని పోలీసులు చెబుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. మంత్రి హరీష్ రావు కూడా ఇదే ఆరోపించారు. సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్‌లో మాట్లాడాడని వెల్లడించారు. లీకేజీ విషయంలో భాగంగానే సంజయ్‌కు కూడా ఫోన్ చేశాడని ఆరోపించారు. తన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మంత్రి హరీశ్‌రావు ఈ మాటాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.
-బండి సంజయ్ లీక్ చేశాడంటున్న బీఆర్ఎస్
బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం వరంగల్‌లో జరిగిన ఎస్‌ఎస్‌సి పరీక్ష పేపర్ లీకేజీకి సూత్రధారిగా బండి సంజయ్ ఉన్నారని బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ మంత్రులు , నేతలు ఆరోపిస్తున్నారు. "వరంగల్‌లో జరిగిన ఎస్‌ఎస్‌సి పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఇప్పుడు జర్నలిస్టు కాదు, బిజెపి కార్యకర్త. పరీక్షకు ఒకరోజు ముందు సంజయ్ తనతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా ప్రశ్నపత్రం లీక్ అయ్యేలా చూడాలని సూచించాడు'' అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు ఇబ్బందులకు గురిచేయాలని ప్లాన్ చేశాడని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంజయ్ ఆధ్వర్యంలోనే వరంగల్ ప్రశ్నపత్రం ఇష్యూ నిందితుడు ప్రశాంత్ ఎస్‌ఎస్‌సీ హిందీ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి రాజకీయ మైలేజీని పొందాలని సంజయ్ ప్రయత్నిస్తున్నారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి'' అని కోరారు.
బీజేపీ చేస్తున్న ఇలాంటి చౌకబారు వ్యూహాలకు బలి కావద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరువు తీసేందుకు బీజేపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా బురదజల్లుతున్నారని అన్నారు. "టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్ ఇష్యూ అయినా, ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్ అయినా బీజేపీ కార్యకర్తలు అలాంటి నేరాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా చేస్తున్నారు'' అని ఆయన అన్నారు. ఈ వ్యూహాలన్నింటి వెనుక ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉందని... బిజెపి పన్నాగాలను బట్టబయలు చేస్తామని సుమన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు, బిజెపి నాయకులు ప్రశ్న పత్రాలను లీక్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం , ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని ఆరోపించారు.
-ఖండించిన బీజేపీ.. రంగంలోకి బీజేపీ పెద్దలు
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. పరిస్థితులు, అరెస్ట్ కు గల కారణాలను తెలియపరిచారు. తెలంగాణ పోలీసులు సంజయ్ పైన నమోదు చేసిన కేసులను పేర్కొన్నారు. డీజీపీతోనూ కిషన్ రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. ఇక ప్రధాని నరేంద్రమోడీ సైతం తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ ను తప్పు పట్టారు. కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈణెల 8న తెలంగాణకు రాబోతున్నారు. ఈక్రమంలోనే పేపర్ లీక్ ల విషయం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈకేసులో బండి సంజయ్ అరెస్ట్ తో కేసు మలుపుతిరిగింది. మరి ఈ లీక్ చేసిన వారు ఎవరు? ఇందులో బండి సంజయ్ పాత్ర ఎంత ఉందన్నది ఈ మధ్యాహ్నం వరంగల్ సీపీ ప్రెస్ మీట్ లో పెట్టి చెబుతాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.