Begin typing your search above and press return to search.
హమ్మయ్య! విదేశీయులకు శుభవార్త వినిపించిన ట్రంప్
By: Tupaki Desk | 2 May 2020 11:30 AM GMTప్రస్తుతం అమెరికా కరోనాతో తీవ్రంగా పోరాడుతోంది. దీంతో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక స్వదేశాలకు తిరిగిరాలేక చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పుడు వారందరికీ శుభవార్త అందించింది. వాటికి అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను నిలిపి వేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు ఆందోళన పడిన విషయం తెలిసిందే. అలాంటి వారికి తాజాగా నిర్ణయం తో రెండు నెలల సమయం దొరికింది.
హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని యూఎస్‌సీఐఎస్ ఉత్తర్వుల్లో సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుంచి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని ఉత్వరుల్లో పేర్కొంది.
అమెరికా లో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వారిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. తాజా నిర్ణయం తో వారికి ఊరట లభించింది.