Begin typing your search above and press return to search.

ఏమిటీ బ్రెయిన్ వెకేషన్? అదెలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   1 July 2023 9:00 AM GMT
ఏమిటీ బ్రెయిన్ వెకేషన్? అదెలా ఉంటుంది?
X
వెకేషన్.. ఆ మాట అన్నంతనే ఒకలాంటి హుషారు. మరింత ఉత్సుకతతో పాటు.. కాసింత ఎక్సైంటింగ్ గా అనిపించటం మామూలే. అయితే.. రోటీన్ వెకేషన్ లో ఉండే బోరింగ్ అంశం.. ఆఫీసుకు దూరంగా ఉన్నా.. మొబైల్ తో కనెక్టు కావటం.. కోలీగ్స్.. బాస్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వెకేషన్ ను గడిపేయటం కొందరిలో కనిపిస్తుంది. ఇదంతా చూసినప్పుడు.. ఇంటికి ఆఫీసును తీసుకెళ్లినట్లుగా.. ఊరికి ఆఫీసును తీసుకెళ్లిన భావన కలగటం ఖాయం. ఈ తరహా వెకేషన్ కు భిన్నం బ్రెయిన్ వెకేషన్. రోటీన్ లైఫ్ కు అలిసిపోయి.. కొన్ని రోజుల పాటు ఎలాంటి కమ్యునికేషన్ కు దొరకని కీకారణ్యంలోకి పారిపోవాలని భావిస్తుంటారు.

శారీరకంగా కాకున్నా.. మానసికంగా అలసిపోయినోళ్లు తమను తాము రీఛార్జ్ చేసుకునేందుకు చేపట్టే బ్రెయిన్ వెకేషన్ ఇప్పుడు ట్రెండీగా మారింది. చాలామంది ఫ్యామిలీతో.. స్నేహితులతో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తారు. కానీ.. తిరిగి వచ్చేసరికి పెద్దగా ఎంజాయ్ చేసింది ఉండదు. ఎందుకంటే.. వెళ్లింది వెకేషన్ కు అయినప్పటికీ రోజువారీ పనుల్ని చేయటమే దీనికి కారణం.

అందరికి తెలిసిన వెకేషన్ కు భిన్నంగా ఉంటుంది బ్రెయిన్ వెకేషన్. దీన్లో భాగంగా ఎక్కడికి వెళ్లాలన్న ఆలోచన అస్సలు అక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్లొచ్చు. పర్వతారోహణ చేయొచ్చు. బీచ్.. అడవులు.. ఎవరూ లేని ప్రాంతాలకు.. ఇలా ఎక్కడికైనా వెళ్లొచ్చు. కావాలంటే రద్దీ నగరాలకైనా వెళ్లొచ్చు. అదేమీ లేకుండా బ్రెయిన్ వెకేషన్ రీట్రీట్ లు అందించే సంస్థలు కూడా వచ్చేశాయి. ఈ వెకేషన్ రోజువారీ జీవితానికి చిన్నపాటి పాజ్ లాంటిది.

మనకున్న సందేహాల్ని.. అనుమానాల్ని.. భయాల్ని అధిగమించేందుకు.. మనల్ని మనం తెలుసుకునేందుకు సాయం చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటకు వచ్చేలా ఉంటాయి. బ్రెయిన్ వెకేషన్ లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వేర్వేరు రంగాలకు చెందిన వారు.. వయసులో వ్యత్యాసం ఉన్న వారు.. ఇలా సంబంధం లేని అంశాలు.. రోజువారీ జీవితంలో తారసపడని వారెందరినో కలిసే వీలుంటుంది. వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం.. ఈ వెకేషన్ తో కలుగుతుంది.

కొత్త ప్రదేశాలకు.. కొత్త వాతావరణంలో జర్నీ చేయటం వల్ల.. అంతాకొత్తగా ఉంటుంది. అయితే.. ఈ వెకేషన్ లో మొత్తం మారిపోతుందని.. చిటికెలో అద్భుతాలు జరుగుతాయన్న మేజిక్కులు ఏమీ ఉండవు. నిజానికి.. బ్రెయిన్ వెకేషన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా సాగేది. ఇంకా చెప్పాలంటే.. అనూహ్యంగా ఏమైనా జరగొచ్చు. ప్లాన్ ప్రకారం జరిగే అవకావం తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికి నిరాశకు గురి కాకుండా.. కాలంతో పాటు ప్రయాణిస్తూ.. మనకు మనం సేద తీరేందుకు బ్రెయిన్ వెకేషన్ సాయం చేస్తుంది. మరి..ఒకసారి ట్రై చేస్తారా?