Begin typing your search above and press return to search.
మోడీ అన్న తర్వాత ఆ మాత్రం మోత లేకుంటే ఎలా? 2 ఏళ్లలో రూ.400 బండ
By: Tupaki Desk | 2 March 2023 10:23 AM GMTమోడీ అంటే మాటలా? అంటూ ఆయన గురించి.. ఆయన పాలన గురించి గొప్పలు చెప్పేటోళ్లు.. జబ్బలు చరిచేటోళ్లకు కొదవ ఉండదు. మరి.. అంతలా పాలించే ఆయన పాలనలో నిత్యావసర వస్తువల ధరలు కిందకు ఉండాలి కదా? మరి.. ఆకాశానికి ఎందుకు పోతున్నాయి. అదేమంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం అంటూ మాటలు చెప్పటం ఈ మధ్యన చూస్తున్నదే. మరి..
మాంద్యం అయితే ఇప్పుడే వచ్చింది. మరి రెండేళ్ల నుంచి సామాన్యుల నుంచి అసమాన్యుల వరకు ప్రతి ఒక్కరికి తేడా లేకుండా బాదేస్తున్న ఆయన బండ బాదుడు తాజాగా మరోసారి బాదేసిన వేళ.. గ్యాస్ సిలిండర్ ఒక్కొక్కటి వెయ్యి ప్లస్ కు చేరుకుంది.
మోడీ సర్కారు మొదటిసారి అధికారాన్ని చేపట్టిన నాటికి అంటే 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే.. ఇప్పుడు అది కాస్తా ఏకంగా రూ.1155కు చేరుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశ ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా మాటలు చెప్పే మోడీ మాష్టారు.. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. వంటింటి బడ్జెట్ మీద భారీ ప్రభావాన్ని చూపే గ్యాస్ బండ ధరను భారీగా పెంచేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా డొమెస్టిక్ సిలిండర్ ధర ఒక్కొక్కటి రూ.50 చొప్పున.. వాణిజ్య సిలిండర్ ధరను రూ.350కు పెంచేయటంతో చిరు వ్యాపారుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పక తప్పదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసిన వెంటనే..గ్యాస్ బండ ధరను పెంచేస్తూ నిర్ణయాన్ని వెలువర్చటం విశేషం. తాజాగాపెంచిన ధరతో హైదరాబాద్ లో గ్యాస్ బండ ధర రూ.1105 నుంచి రూ.1155కు చేరుకోనుంది.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్యాస్ బండలు ధర వరకు వస్తే అప్పట్లో రూ.694 నుంచి రూ.750 మధ్యన ఉండేది. ఆ మాటకువస్తే 2014లో గ్యాస్ బండ ధర రూ.400 మాత్రమే ఉంది. ఇక.. మోడీ ప్రధానమంత్రి అయ్యాక బండ ధర పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. ఇక.. 2021 నుంచి 2023 మార్చి ఒకటి నాటికే చూసుకుంటే.. ఇప్పటివరకు 15సార్లు గ్యాస్ బండ ధరల్ని పెంచారు.
2021లో రూ.694గా ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు ఏకంగా రూ.1155 వరకు దూసుకెళ్లటం చూస్తే.. మోడీ సాధించిన అద్భుత ప్రగతి ఎంతన్నది అందరి కళ్ల ముందు కనిపించే పరిస్థితి. మోడీ మాష్టారిని నమ్మి ఓటేసినందుకు ఆ మాత్రం భారం మోయక తప్పదన్న మాట వినిపిస్తోంది. దేశం కోసం గ్యాస్ సబ్సిడీల్ని వదులుకున్న లక్షలాది మంది ఇప్పుడీ భారంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. మోడీనా.. మజాకానా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.