Begin typing your search above and press return to search.

వీర్యకణాలు లేకపోతే మగతనం లేనట్లే?

By:  Tupaki Desk   |   20 Nov 2020 11:30 PM GMT
వీర్యకణాలు లేకపోతే మగతనం లేనట్లే?
X
ఇటీవలి కాలంలో సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పని ఒత్తిడి, కాలుష్యం, వ్యాయామలేమి, ఇతర అనారోగ్య సమస్యలు వారిలో సంతానలేమికి కారణమవుతున్నాయి. ఒక ఏడాది పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా వైవాహిక జీవితం కొనసాగించినా పిల్లలు కలగకపోతే సంతానలేమి సమస్య ఉన్నట్లుగా భావించాలి. సంతానలేమికి కారణాలు స్త్రీలలోనే ఉంటాయనుకుంటారు. కానీ పురుషుల్లోనూ ఉంటాయి. కొందరిలో ఎటువంటి కారణం కనిపించదు. కానీ సంతానలేమి ఉంటుంది.

మామూలుగా ప్రతీ పురుషునిలో 3 నుంచి 6 మి.లీ. వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఇందులో దాదాపు 60మిలియన్ల నుంచి 150 మిలియన్ల వీర్యకణాలుంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక భాగాలు ఉంటాయి. సాధారణంగా వీర్యంలో దాదాపుగా 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలు ఉంటాయి. 80 శాతం కణాలు మామూలు ఆకృతిని కలిగి ఉంటాయి. పైన చెప్పుకున్న విధంగా వీర్యకణాలుంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు.

* వీర్యకణాల సమస్యల సమస్యలివీ..

అజూస్పెర్మియా : వీర్యకణాలు అసలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. వీర్యం నీటివలే, అతి పలుచగా ఉంటుంది.

అలిగోస్పెర్మియా : వీర్యకణాల సంఖ్య 60 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది.
అలిగోఅస్థినోస్పెర్మియా: వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉంటుంది.

*వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణాలు :

హార్మోన్ల లోపం. మానసిక ఒత్తిడితోపాటు వెరికోసీల్. ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం.. బీజంలో సమస్యలు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక అంగస్థంభన సమస్యలు కారణమవుతాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా సంతానలేమికి కారణమవుతుంటాయి.

*సామాజిక సమస్య

మగవాళ్లు తండ్రులు కాలేకపోవడం క్రమంగా పెరుగుతూ సామాజిక సమస్యగా మారుతోంది. ఇలాంటి సమస్యల చికిత్సకు చాలామంది పురుషులు ఇష్టపడరు. తమ మగతనంలో లోపంగా భావిస్తారేమోనని వెనకాడతారు. చాలామంది మగవాళ్లు సంతానలేమికి సంవత్సరాల తరబడి భార్యలకు చికిత్స చేయిస్తారు తప్ప, తాము మాత్రం ప్రాథమిక పరీక్షలు కూడా చేయించుకోరని పలువురు ఆరోగ్య నిపుణులు తెలిపారు.అజూస్పెర్మియా (Azoospermia) అనే సమస్యతో పిల్లలు కలుగని మగవాళ్లు బాధపడుతున్నారని తేలింది. వీర్యంలో శుక్రకణాలలేమినే వైద్య పరిభాషలో అజూస్పెర్మియా అంటారు. దీనిని సరి చేయకపోతే సంతానం పొందడం సాధ్యం కాదు.

* పిల్లలను కనలేకపోవడం మగతనంలో లోపమా ?

సంతానలేమితో బాధపడుతున్న భర్తలలో 90 శాతం మంది తమ భార్యలకు చికిత్స గురించే మాట్లాడతారని డాక్టర్లు అంటున్నారు.కొందరు తమలో ఏ లోపం లేదని రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటుంటారని, తర్వాత విషయం గ్రహించి తమ వద్దకు వస్తున్నారని ఓ డాక్టర్ తెలిపారు.