Begin typing your search above and press return to search.
23 వేల అడుగుల ఎత్తులో పైలెట్ ముందున్న అద్దం పగిలితే?
By: Tupaki Desk | 19 Nov 2020 6:30 AM GMTఊహించటానికే భయానకంగా అనిపించే ఉదంతం దాదాపు 30 ఏళ్ల క్రితం చోటు చేసుకుంది. భూమికి 23 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమాన అద్దం ఊడిపోతే? అది కూడా పైలెట్ ముందున్న అద్దం అయితే పరిస్థితి ఏమిటి? గంటకు 650కి.మీ. వేగంతో దూసుకెళుతున్న విమానం.. గాలి తీవ్రతకు పైలెట్ ఎగిరిన వేళ.. అతనికి ఏమైంది? అయినా.. అప్పుడెప్పుడో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడెందుకు వైరల్ గా మారిందన్న విషయంలోకి వెళితే..
బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన ఒక పైలెట్ కు ఊహకు అందని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. విమానం 23 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న వేళ.. పైలెట్ ఎదురుగా ఉన్న అద్దం ఊడిపోయింది. గాలి ఒత్తిడికి సదరు పైలెట్ (టిమ్) ఒక్కసారిగా బయటకు విసిరేసినట్లు విమానం బయటకు ఎగిరిపోయాడు. లక్కీగా.. అతడి కాళ్లు సీటుబెల్ట్ కు చుట్టుకోవటంతో విమానం నుంచి వేలాడుతున్నాడు. ఇలంటివేళ.. క్యాబిన్ సిబ్బందిలో ఒకరైన జాన్.. వెంటనే స్పందించి ఎగిరిపోతున్న పైలెట్ కాళ్లను బలంగా పట్టుకొని లోపలకు లాగసాగాడు. అంతేకాదు.. పైలెట్ కుర్చీకి ఉండే బెల్టును అతడి నడముకు కట్టేశాడు.
శరీరమంతా విమానం బయట గాల్లోనే ఉంది. ఈ ప్రమాదం గురించి కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. వెనువెంటనే సౌత్ అంప్టన్ విమానాశ్రయంలో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అత్యవసర వైద్య సిబ్బంది పైలెట్ ను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అతడు కొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తానికి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న టిమ్.. ప్రస్తుతం నార్మల్ జీవితాన్ని గడుపుతున్నాడు.
అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి తెలిస్తే మాత్రం గుండె వేగంగా కొట్టుకోవటం కాయం. సీటు బెల్టు వల్ల ఇర్కుపోయి.. పూర్తిగా గాల్లోకి ఎగిరిపోలేదు. కో పైలెట్లు టిమ్ కాళ్లు గట్టిగా పట్టుకోవటంతో.. గాలి ఒత్తిడికి ముఖం విమానానికి గుద్దుకుంటోంది. పైలెట్ ముక్కలో నుంచి రక్తం కారుతోంది. తీవ్రమైన గాలి కారణంగా కళ్లు పెద్దవిగా సాగుతూ.. భయంకరంగా కనిపించారు. పైలెట్ చనిపోవటం ఖాయమని అనుకున్నారు. లక్కీగా ఈ అనూహ్య ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ.. ఈ విషయం తాజాగా వైరల్ కావటానికి కారణం.. ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో అప్పుడెప్పుడోజరిగిన ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ పోస్టు చేశారు. దీంతో.. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఉదంతం వైరల్ గా మారింది.