Begin typing your search above and press return to search.

కార్పోరేటర్ల భర్తలైతే ఏంటీ .. బయటకి వెళ్లండి, మున్సిపల్‌ కార్యాలయంలో దడ పుట్టించిన ఏసీపీ!

By:  Tupaki Desk   |   10 Feb 2021 11:35 AM GMT
కార్పోరేటర్ల భర్తలైతే ఏంటీ .. బయటకి వెళ్లండి, మున్సిపల్‌ కార్యాలయంలో దడ పుట్టించిన ఏసీపీ!
X
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కార్పోరేటర్ భర్తలకు అవమానం జరిగింది. కార్పొరేషన్ ఆవరణలో ప్రారంభించిన దీక్షా దివస్ పైలాన్ కార్యక్రమానికి మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు కూడా వచ్చారు. వీరిలో మరుపల్లి రవి,మేడిది మధు సూధన్, యేలుగం సత్యనారాయణ, ఎండీ,మాక్సూద్, కేషబోయిన శ్రవణ్, సోమిశెట్టి ప్రవీణ్, తదితరులు కార్యాలయంలో కూర్చొని ఉన్నారు. పైలాన్ ఏర్పాటు ను వ్యతిరేకించిన బీజేపీ జిల్లా శ్రేణులు కార్పొరేషన్ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి రావడం తో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు.

అక్కడ ,ప్రతి కూల వాతావరనాన్ని గమనించిన ఏసీపీ కలకోట్ల గిరికుమార్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. కమీషనర్ ను కలిసి వినతి పత్రం అంద జేయడానికి పరిమితి సంఖ్యలో బీజేపీ శ్రేణులకు అనుమతి ఇచ్చారు. కార్పొరేషన్ లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది మినహా అందరిని కార్యాలయం బయటకు పంపేశారు.

అప్పటికే మేయర్ ఛాంబర్లో మాట్లాడుకుంటూ కూర్చున్న కార్పొరేటర్ల భర్తలను ఏసీపీ స్వయంగా వెల్లి బయటకు పంపించాడు. కార్పొరేషన్ ఆవరణలో సమావేశానికి సంబంధం లేని వారు అధికార పార్టీ నాయకులు అయినా ఉండడానికి వీలు లేదని హెచ్చరించారు. దీనితో ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకుంటూ టైం పాస్ చేసే అలవాటు ఉన్న కార్పొరేటర్ల భర్తలు ఏసీపీ వార్నింగ్ తో కంగు తిన్నారు. చేసేదేం లేక కామ్ ‌గా బయటకు వెళ్లిపోయారు.