Begin typing your search above and press return to search.
వీరు వాడని బ్యాంకు అకౌంట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?
By: Tupaki Desk | 2 Dec 2021 11:30 AM GMTఈరోజుల్లో నగదుకు సంబంధించిన ప్రతీ వ్యవహారం బ్యాంకుతో ముడిపడి ఉంది. ఒకరి నుంచి మరొకరికి నగదు బదలాయించడానికి మధ్యవర్తిగా బ్యాంకు ఉంటోంది. కేవలం నగదు బదలాయించడమే కాకుండా ఆయా బ్యాంకుల్లో నగదు నిల్వ ఉంటే నిర్ణీత రేటుతో ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నాయి. అయితే కొందరు ఏవేవో అవసరాల కోసం బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేస్తారు. ఆ తరువాత వాటిని పట్టించుకోరు. ఇలా ఒక్కొక్కరి వద్ద పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో ట్రాన్సాక్షన్ చేయకపోవడంతో పాటు వాటి నిర్వహణ లేకపోవడంతో అవి పెండింగులోనే ఉన్నాయి. అయితా తాజాగ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి నిర్వహణ లేని వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది.
కొన్ని అవసరాల కోసం బ్యాంకు ఖాతాలు తీశారని, పదేళ్ల నుంచి వాటిని నిర్వహించడం లేదని ఆమె తెలిపారు. ఇలా వినియోగంలేని బ్యాంకు ఖాతాల్లో రూ.26,697 కోట్లు మగ్గుతున్నాయని ఆమె సంచలన విషయాన్ని చెప్పారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం 2020 డిసెంబర్ 31 నాటికి 9 కోట్లు ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు తెలిపారు. వీటిలో షెడ్యూల్డ్ బ్యాంకుల్లో 8,13,34,849 అకౌంట్లలో రూ.24,356 కోట్లు డిపాజిట్లు అయ్యాయి. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో 77,03,819 అకౌంట్లలో రూ.2,341 కోట్ల డబ్బు నిల్వ ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో 64 అకౌంట్లలో ఉన్న సొమ్ము రూ.0.71 కోట్లు.
అయితే ఈ అకౌంట్లకు సంబంధించిన వారసులను వెతికి పట్టుకోవాలని వాటి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే రెండేళ్లు బ్యాంకు ఖాతా నిర్వహణ సరిగా లేకుంటే చర్చలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. నిర్వహణ సరిగా లేని బ్యాంకు ఖాతాలను నోటీసు బోర్డులో పెట్టాలని, అలాగే వినియోగంలో లేని ఖాతాల్లో డబ్బును డిపాజిటర్ల విద్య, అవగాహన ఫండ్ స్కీమ్, 2014 స్కిమ్ కు బదలాయించి అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పెండింగులో ఉన్న ఖాతాలు వెలుగులోకి రానున్నాయి.
కొందరు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి ఆ తరువాత వాటి గురించి పట్టించుకోరు. అంతేకాకుండా మినిమమ్ బ్యాంకు చార్జీలు కూడా చెల్లించరు. దీంతో అలాంటి ఖాతాలపై ఇక ఫైన్ విధించే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్ వేదికగా ఈ విషయం గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొందరు అనవసరంగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలను ఫైన్ కట్టి క్లోజ్ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు.
ఇంతకాలం ఇలాంటి ఖాతాలను బ్యాంకులు కూడా పట్టించుకోలేదు. దీంతో ఆ ఖాతాల్లోని డబ్బు అలాగే ఉండిపోయి కోట్ల రూపాయలు ఎవరికీ ఉపయోగపడకుండా మూలుగుతున్నారు. గతంలో బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి పెద్ద ప్రయాస ఉండేది. కానీ నేడు ఈజీగా మారిపోయింది. దీంతో కొందు ఉద్యోగులు తమ సంస్థలు మారిన క్రమంలో ఆయా సంస్థలకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల్లో ఖాతాలు తీయాల్సి ఉంటుంది. దీంతో ఇలా ఒక వ్యక్తి పేరు మీద అనే ఖాతాలు పెండింగులో ఉన్నాయి. కానీ ఇకపై అలా పెండింగులో ఉండే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచనలు చేయడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. అయితే పెండింగులో ఉన్న ఖాతాలను ఉపయోగపడేలా చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. అలాంటి సమయంలో వీటిని ఏ విధంగా ప్రయోజనంలోకి తెస్తారోనన్న చర్చ సాగుతోంది.