Begin typing your search above and press return to search.
కరోనా, డెంగీ ఓకేసారి వస్తే పరిస్థితి ఏంటి? కేంద్రం మార్గదర్శకాలు
By: Tupaki Desk | 2 Nov 2020 8:10 AM GMTఓ వైపు కరోనా, మరో వైపు సీజనల్ వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ.. డెంగీ కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. పలు నగరాల్లోని మురికి వాడల్లో డెంగీ వేగంగా వ్యాపిస్తున్నది. రెండు వ్యాధులు ఒకే సారి ముంచుకురావడంతో వైద్యులకు చికిత్స అందించడం సవాలుగా మారింది. ఒకే వ్యక్తికి రెండు వ్యాధులు వస్తే ఏం చేయాలన్న దానిపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా, డెంగీ రెండు పరీక్షలు చేయాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. రెండు వ్యాధులు తీవ్రమైతే ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది.
రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డెంగీ రోగుల్లో హెపారిన్ ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో కరోనా, డెంగీ బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. రెండు రోగాలు ఒక్కరికే వస్తే తప్పకుండా ఆస్పత్రిలో చికిత్స అందించాలి. లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స మార్చాలి. డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అలాగే ప్లేట్‌లెట్స్ ఎక్కించే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించాలి. ఛాతీలో ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేయించాలి.