Begin typing your search above and press return to search.
మరో రూ.50 లక్షలు చొప్పున ఖర్చు చేసి ఉంటేనా?
By: Tupaki Desk | 6 Dec 2020 11:30 PM GMTగ్రేటర్ ఫలితాల సంచలనం రాజకీయ వర్గాల్లో అంతకంతకూ చర్చ పెరుగుతోంది. సాధించిన స్థానాల పట్ల తొలుత నిరాశకు గురైన తెలంగాణ అధికారపక్షం.. నిన్నటి నుంచి వస్తున్న గణాంకాల్ని విశ్లేషించుకుంటున్న కొద్దీ.. బీపీ పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు సాధించిన స్థానాల విషయంలో సంతోషంగా లేని వారు.. ఇప్పుడు తమకున్న ఏదో సుడితో ఈ మాత్రం బయటపడి పరువు దక్కించుకున్నట్లుగా భావిస్తున్నారు.
టీఆర్ఎస్ - బీజేపీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం ఆరు వేలు మాత్రమే కావటం.. ఇంత స్వల్ప వ్యత్యాసానికి ఆరు సీట్లు అదనంగా తమ ఖాతాలో పడటం వారికిప్పుడు ఊరటనిస్తోంది. అదే సమయంలో.. తాము పెట్టిన ఖర్చు కంటే కూడా.. ప్రత్యర్థి పార్టీ పెట్టిన ఖర్చు మీదనే తెలంగాణ అధికారపక్షంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత అనుకున్న బడ్జెట్ కు రెట్టింపు అయినప్పటికీ వెనుకాడకుండా డబ్బులు తీసినోళ్లు.. గెలుపును అస్వాదిస్తున్నట్లు చెబుతున్నారు.
మరికొందరు డబ్బులు తీసేందుకు వెనుకాడిన దానికి తగిన మూల్యం చెల్లించినట్లుగా చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు రూ.6కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక..పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని ఒక డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. సర్వేల్లో ఓటమి ఖాయమన్నట్లుగా రావటంతో.. అలెర్టు అయిన సదరు అభ్యర్థి.. ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని తేల్చి.. అందుకు తగ్గట్లే ఖర్చు చేయటం ఇప్పుడా అభ్యర్థిని గెలుపుబాట పట్టించిందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమకు బీజేపీకి మధ్య డివిజన్ల వ్యత్యాసం ఏడు మాత్రమే. నిజానికి.. టీఆర్ఎస్ తో పోలిస్తే.. బీజేపీ వారు పెట్టిన ఖర్చు చాలా తక్కువ. ఒకవేళ.. బీజేపీ అభ్యర్థులు కానీ.. ఇప్పుడు పెట్టిన ఖర్చునకు అదనంగా రూ.50 లక్షలు చొప్పున ఖర్చు చేసి ఉంటే.. 80 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు బీజేపీ అభ్యర్థులు వెనుకాడటం తమకు వరంగా మారిందని భావిస్తున్నారు. ‘‘వాళ్లు కానీ రూ.50 లక్షలు చొప్పున ఒక్కో డివిజన్ కు అదనంగా ఖర్చు చేసి ఉంటేనా? ఆలోచించటానికి కూడా వణుకు తెప్పిస్తుంది. పరిస్థితి మరోలా ఉండేది. ఏమైనా వారు అంత భారీగా ఖర్చు చేయటం మంచిది అయ్యింది’’ అని టీఆర్ఎస్ నేతలు పలువురు వ్యాఖ్యానించుకోవటం గమనార్హం.