Begin typing your search above and press return to search.

డార్క్ చాక్లెట్స్ తింటే ఏం జరుగుతుంది ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 11:42 AM GMT
డార్క్ చాక్లెట్స్ తింటే ఏం జరుగుతుంది ?
X
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం.. శారీరక శ్రమ లేని పనులు చేస్తుండటంతో అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. తద్వారా ఒబిసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు వేధిస్తున్నాయి. హృద్రోగ సంబంధిత రోగాల నుంచి తప్పించుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయ‌ని వారు సూచిస్తున్నారు. అయితే చలికాలంలో చాక్లెట్లు తింటే జలుబు చేస్తుందని పిల్లలను చాక్లెట్ తినవద్దని తల్లిదండ్రులు చెబుతుంటారు. కానీ వాస్తవానికి డార్క్ చాక్లెట్ తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ తయారీలో వాడే కోకో పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు ధరిచేరవు. అంతేకాక డార్క్ చాక్లెట్ను రెగ్యులర్గా సరైన మోతాదులో తీసుకుంటే చలికాలంలో శరీరంలోని వేడిని పెండి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది.

ఈ డార్క్ చాక్లెట్లు 'థియోబ్రామా కాకో' అని పిలువబడే కాకో చెట్టు భాగాల నుండి తయారు చేయబడతాయి. డార్క్ చాక్లెట్‌ లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల అద్భుతమైన 6 ప్రయోజనాలున్నాయి. డార్క్ చాక్లెట్‌ లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ మీ శరీరంలో సహజంగా సంభవించే పదార్ధం. ఇది రక్త నాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.

ఇక డార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనగా ఎల్‌ డిఎల్‌ ను తగ్గిస్తుంది. అదేవిధంగా, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌ డిఎల్‌ ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీంలో ఎల్డీఎల్ స్థాయి పెరిగితే ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఎల్డీఎల్ స్థాయి తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, మీ మెదడును ఉత్తేజం చేయడానికి డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది. 2012లో, నాటింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్య ప్రాంతాలకు రక్త ప్రవాహం పెరుగుతుందని కనుగొన్నారు.

ఇది మెదడు పనితీరును, అప్రమత్తతను మెరుగుపరుస్తుంది. 2013లో న్యూరాలజీ జర్నల్‌ లో ప్రచురించబడిన మరో అధ్యయనంలో ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినడం ద్వారా మీ జ్ఞాపకశక్తి దాదాపు 30% పెరుగుతుందని, మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగవుతాయని తేలింది. డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని 2015లో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. 2014లో అమెరికన్ కెమికల్ సొసైటీ సమర్పించిన మరొక అధ్యయనంలో మీరు డార్క్ చాక్లెట్ తినేటప్పుడు, మీ కడుపులోని గట్ బ్యాక్టీరియాను బయటికి పంపిస్తుందని పేర్కొంది. దీంతో ప్రతిరోజూ చాక్లెట్ తినడం వలన గణనీయమైన మొత్తంలో హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని తేలింది.

డార్క్ చాక్లెట్లలో అధిక సంతృప్తి విలువలు కలిగి ఉంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అందువల్ల అవి తిన్నప్పుడు మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అవి మీ జీవక్రియను పెంచడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహకరిస్తాయి. డార్క్ చాక్లెట్లను మితమైన పరిమాణంలో తిన్నప్పుడు, జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతో కోరికలను అరికట్టవచ్చు. కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం 1000 మంది అమెరిన్లపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత డార్క్ చాక్లెట్‌ ను తింటే బరువు పెరగడాన్ని అరికట్టే అవకాశం ఉందని మరో అధ్యయనం తెలిపింది.