Begin typing your search above and press return to search.

సుజనా విషయంలో ఏమవుతుంది ?

By:  Tupaki Desk   |   11 Feb 2021 5:30 PM GMT
సుజనా విషయంలో ఏమవుతుంది ?
X
తెలుగుదేశంపార్టీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరిని విచారణకు హాజరవ్వాలంటూ చెన్నైలోని కోర్టు నోటీసులిచ్చింది. మనీల్యాండరింగ్ చట్టాల క్రింద నమోదైన కేసుల విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలంటు నోటీసులో కోర్టు స్పష్టంగా చెప్పింది. సుజనాపైన ఇఫ్పటికే అనేక కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. వివిధ షెల్ కంపెనీలు పెట్టి భారీ ఎత్తున బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నారనే విషయం ఇప్పటికే రుజువైంది.

బ్యాంకుల్లో తీసుకున్న వేలాది కోట్లరూపాయల అప్పును సుమారు 110 షెల్ కంపెనీలు పెట్టి విదేశాలకు తరలించారనే అభియోగాలు నమోదయ్యాయి. వీటిపై సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఐటి అధికారులు ఇఫ్పటికే చాలాసార్లు దాడులు జరిపి అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు సుజనా అరెస్టు ఖాయమని తేలిపోయినా అప్పట్లో ఎన్నికల వేడి కారణంగా ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తు చంద్రబాబునాయుడు అప్పట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సుజనాతో పాటు మరో ముగ్గురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. దాంతో అప్పటి వరకు సుజనాపైన జరిగిన దాడులు, అరెస్టు భయం లాంటివి పటాపంచలైపోయాయి. సుజనా బీజేపీలోకి ఫిరాయించిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క కేంద్ర దర్యాప్తుసంస్ధ కూడా దాడి జరపలేదు.

బీజేపీ చేరిన తర్వాత ఇక సుజనా లాంటి వాళ్ళ సేఫ్ అని అనుకుంటున్న నేపధ్యంలో హఠాత్తుగా మనీల్యాండరింగ్ కేసులో 12వ తేదీన విచారణకు హాజరవ్వాలని చెన్నై కోర్టు నోటీసులు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. ఇపుడందరి దృష్టి శుక్రవారం జరగబోయే విచారణపైనే కేంద్రీకృతమైంది. చూద్దాం ఏమి జరగబోతోందో.