Begin typing your search above and press return to search.
ఈటల గెలిస్తే.. తెలంగాణలో ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 1 Nov 2021 2:30 AM GMTతాజాగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ముగిసింది. అయితే.. దీనికి స్థానికంగానే కాదు..రెండు తెలుగు రాస్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా .. చర్చ సాగింది. వాస్తవానికి ఉప ఎన్నికపై జాతీయ మీడియా దృష్టి పెట్టదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం జాతీయ మీడియా కూడా ఆరాతీయడం.. హుజూరాబాద్ నియోజకవర్గం పై విశ్లేషణలు రాయడం కూడా జరుగుతున్నాయి. అంతేకాదు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యంత ఖరీదైన ఎన్నికగా కూడా హుజూరాబాద్ నిలిచింది.
మరి ఇంత జోరుగా చర్చ చేయడానికి.. జాతీయ మీడియా కూడా రియాక్ట్ కావడానికి.. కారణం ఏంటంటే.. ఇక్కడేదో.. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నట్టు కాదు.. ఈ ఉప ఎన్నికే!! అది కూడా ప్రధాన పక్షాలైన అధికార పార్టీ టీఆర్ ఎస్, ప్రతిపక్షం బీజేపీలు.. ఇక్కడ ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ ఈటల రాజేందర్‌ను ఓడించాలని.. అధికార టీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి చాలా మండలాల్లో.. 500 నోట్లతో కూడిన కవర్లు.. ఇంటి ముందు వాలాయి.
సో.. దీంతో ఒక్కసారిగా ఈ ఉప ఎన్నిక.. హుజూరాబాద్‌ను జాతీయస్థాయిలో నిలబెట్టింది. ఈ పాయింట్‌ను పక్కన పెడితే.. బీజేపీ అభ్యర్థి అయిన.. మాజీ మంత్రి, కేసీఆర్‌కు ఒకప్పటి మిత్రుడు.. ఈటల రాజేందర్ గెలిస్తే.. టీఆర్ ఎస్ పరిస్థితి ఏంటి? అనేది కూడా చర్చకు వస్తోంది. దీనికి రీజన్ ఏంటంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో దళిత బంధు సహా .. అనేక పథకాలు.. అమలు చేసింది. 2000 కోట్లు నియోజకవర్గం అభివృద్ధికి వెచ్చించింది. అంతేకాదు.. దాదాపు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అక్కడకు పంపి.. చక్రం తిప్పించింది.
మరి ఇంత చేసిన తర్వాత.. కూడా.. టీఆర్ ఎస్ పోతే.. రేపు తెలంగాణలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి అదనంగా బలం చేకూరుతుందని అంటున్నా రు. ఈటల గెలుపు ద్వారా.. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా.. బీజేపీ ఉందనే ప్రచారం జోరందుకుంటుంది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్.. రేవంత్ రెడ్డి పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ వాదులకు నాయకులు .. టాస్కులు ఇస్తూ.. వాటి ద్వారా.. కాంగ్రెస్‌ను పెద్ద ఎత్తున పుంజుకునేలా చేస్తున్నారని ప్రచారం వచ్చింది.
అంతేకాదు.. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కనుక.. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని.. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తెలంగాణలో ఒక విధమైన రాజకీయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంంది. మరోవైపు.. ఈటల గెలిచినా.. బీజేపీకి ధరల పెరుగదల ప్రాణసంకటంగా మారింది.ఈ విషయాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ.. రేపు ఈ ధరల విషయాన్ని టీఆర్ ఎస్ తీసుకున్నా.. దీనికి విరుగుడుగా.. కాంగ్రెస్ మరో వ్యూహం సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేంటంటే.. ఇప్పటికే సీఎం కేసీఆర్.. బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలో మరోసారి ఆయన బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. దీనిని చూపించి కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలూ(టీఆర్ ఎస్-బీజేపీ) ఒక్కటేనని.. ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులు.. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందనరావు.. ఈటల అంతా కూడా.. బీజేపీ బ్యాక్ గ్రౌండ్ నచ్చనివారే. ఈటల కమ్యూనిస్టు భావాలు.. అర్వింద్.. కాంగ్రెస్ భావాలు, రఘునందనరావు.. టీఆర్ ఎస్ భావాలు.. ఉన్నాయి. కాబట్టి.. ఒకవేళ.. బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తే.. వాళ్లు కాంగ్రెస్‌కు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది అని ప్రచారం జరుగుతోంది. సో.. మొత్తంగా చూస్తే.. హుజూరాబాద్ ఒక్క ఎన్నిక.. తెలంగాణలో అనేక మార్పులకు కారణంగా మారుతుందని చెబుతున్నారు పరిశీలకులు.