Begin typing your search above and press return to search.

లైగర్ తో యువరాజ్ ఆట ఆడితే ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   4 Oct 2021 3:19 AM GMT
లైగర్ తో యువరాజ్ ఆట ఆడితే ఏమవుతుంది?
X
తాడును తన బలమైన పళ్లతో పట్టుకొన్న లైగర్ ఒకవైపు.. మరోవైపు మాజీ క్రికెటర్ యువరాజ్ తో పాటు మరో ముగ్గురు బలంగా లాగితే ఎవరు గెలుస్తారు? మధ్యలో మరొకరుకూడా కలిసి ట్రై చేసినప్పుడు కూడా విజయం లైగర్ సొంతమైంది. ఆశ్చర్యంగా అనిపించినా.. ఒక ఆసక్తికరమైన వీడియోను యువరాజ్ సింగ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తాను దుబాయ్ లో సందర్శించిన జూ పార్కు (ఫేమ్ పార్క్)లో తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు.

చింపాజీ.. ఎలుగబంటి.. జిరాఫీలతో పాటు.. మరికొన్ని జంతువులకు ఆహారం తినిపించిన అతను.. లైగర్ కు మాంసాన్ని తానే స్వయంగా తినిపించారు. అదే సమయంలో ఎల్లో కలర్ లో ఉన్న భారీ కొండచిలువను తన మెడలో వేసుకున్న అతను.. కాస్తంత భయానికి గురైనట్లుగా కనిపించింది. సాహసం చేస్తున్న వేళ.. ఏం జరగదన్న మాట చెప్పినప్పటికీ.. అతడితో టెన్స్ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది. మెడలో భారీ కొండ చిలువను వేసుకున్న తర్వాత.. దాన్ని తీసేందుకు వచ్చిన సహాయకుల సాయంతో రిలీఫ్ అయినట్లుగా కనిపించారు.

మరో సందర్భంలో వాడేసిన ఖాళీ వాటర్ బాటిల్ ను పడేస్తే.. ఎలుగబంటి ఆ వాటర్ బాటిల్ ను తీసుకొని అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసిన తీరుకు ఫిదా కావాల్సిందే. మన దేశంలో చాలామంది దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ పంచ్ వేసిన యువరాజ్.. ఫేమ్ పార్కు చాలా సేఫ్ ప్లేస్ గా పేర్కొన్నారు. ఈ జంతువుల్ని చూసుకునే విషయంలో సంరక్షులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వైనం కనిపించిందన్నారు. తాను పోస్టు చేసిన వీడియోను షూట్ చేసే సందర్భంలో జంతువులకు ఎలాంటి హాని తలపెట్టలేదన్న డిస్ క్లైమర్ ను యువరాజ్ వెల్లడించటం గమనార్హం. ఏమైనా.. రోటీన్ కు కాస్త భిన్నమైన అనుభూతిని ఈ వీడియో అందిస్తుందని చెప్పక తప్పదు.