Begin typing your search above and press return to search.

మూత్రం ఆపుకుంటే ఎంత డేంజరో తెలుసా?

By:  Tupaki Desk   |   20 March 2020 4:05 AM GMT
మూత్రం ఆపుకుంటే ఎంత డేంజరో తెలుసా?
X
మూత్ర విసర్జన అనేది మన జీవక్రియలో అత్యంత ముఖ్యమైన పని.. మన శరీరానికి సంబంధించిన ఈ పని మన కంట్రోల్ లో ఉండదు. ఎందుకంటే మూత్రం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన అదుపులో పెట్టుకోలేకపోవచ్చు కాని, వచ్చినప్పుడు బయటకి తోయడం మాత్రం చేయవచ్చు. అసలు మూత్రం ఎందుకు వస్తుంది? దానితో మన శరీరానికి పని ఏంటి ? తెలుసుకుందాం.

ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్ళే ద్రవ పదార్థమే మూత్రం. అంటే మన ఒంటిలోని చెత్తను బయటకితీస్తుంది. మరి చెత్త ఎప్పటికప్పుడు బయటకి తీయాలి కాని ఆపిపెడితే ఎలా ? కొందరికి కాదు, చాలామందికి మూత్రాన్ని ఆపివేసి ఉంచే అలవాటు ఉంటుంది. థియేటర్లో కూర్చుంటారు .. కాని ఒక్క సీన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని విరామం దాకా ఆపుకుంటారు. నిద్ర పోయాక మూత్రం వస్తుంది. కానీ బద్దకంకొద్దీ అప్పుడే లేచి మూత్ర విసర్జన చేయరు. ఇది మంచి అలవాటు కాదు. దీని వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా ?

మన మూత్రం శరీరంలోని టాక్సిన్స్, మలీనాల్ని సాధ్యమైనంతవరకు క్లీన్ చేస్తుంది. ఇది కిడ్నీల్లోంచి బ్లాడర్ లోకి వెళుతుంది. మన బ్లాడర్ ఎప్పుడు కూడా ఫుల్ అయితేనే మూత్రాన్ని బయటకి తోయమని ఫోర్స్ చేస్తుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినప్పుడు బయటకి తోసే ప్రయత్నం చేయదు. మూత్రం వస్తోందన్నట్లు అనిపిస్తేనే అర్థం చేసుకోవాలి బ్లాడర్ ఫుల్ అయి పోతుంది, దాన్ని ఖాళీ చేయాలి అని. నార్మల్ గా, మనుషుల బ్లాడర్ 400 మిల్లీ లీటర్ల నుంచి 600 మిల్లీ లీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ లిమిట్ దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి మీరు ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి.

అయినా మూత్రాన్ని ఆపాల్సినంత పని ఏముంటుంది ? మన శరీరం కోసం ఓ రెండు నిమిషాలు కేటాయించటం అంత కష్టమా? ఆఫీసు మీటింగుల ఉన్నాసరే, ఒక్కనిమిషం పర్మీషన్ అడిగి, ఒకే నిమిషంలో పని పూర్తిచేసుకోవచ్చు. కాబట్టి బ్లాడర్ మీద ఒత్తిడి పెంచే పనులు చేయవద్దు.

మన బ్లాడర్ ఇంతకుముందు చెప్పినట్లుగా 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని మోయగలదు. ఆ లిమిట్ దాటితే బ్లాడర్ మన మెదడుకి సంకేతాలు పంపుతుంది. అప్పుడే మనకు మూత్ర విసర్జన చేయాలన్న జ్ఞానం కలుగుతుంది. మరి మెదడు చెప్పిన మాట వినాలి కదా? వినకపోతే ఎక్కువ మూత్రాన్ని ఆపేందుకు బ్లాడర్ పరిమాణంలో ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇలా పెరగడం అస్సలు మంచిది కాదు. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి. దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలయ ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. దాంతో బ్లాడర్ మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఒత్తిడి పెరిగితే సంకేతాలు త్వరగా అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? కిడ్నీల్లో రాళ్ళు .. ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని పలకరిస్తున్న సమస్య ఇది.

మూత్రాన్ని ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు స్టికిగా మారతాయి. అంటే బంకలా అనుకోండి .. ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి. ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, ఇంకా పెద్ద రాళ్లు వస్తాయి. ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. కిడ్నీల్లో రాళ్ళు స్త్రీ పురుషులిద్దరికి వస్తాయి. కాని మూత్రాన్ని ఆపుకోవడం వలన వచ్చే ఛాన్స్ మహిళల్లోనే ఎక్కువ అంట. పురుషుల మాదిరి ఎక్కడపడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు. అలా ఆపి పట్టే అలవాటు వారిలో ఎక్కువగా ఉండటం ఇలా జరుగుతుందని డాక్టర్ల చెబుతున్నారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా మూత్రాన్ని ఆపి ఉంచుకుంటారు. స్త్రీ సామాజిక ఇబ్బందులు స్త్రీలవి. కాని సైన్స్ కి అవన్ని తెలియవు ..

ఈ మూత్రాన్ని ఆపి ఉంచే అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరీనరి ట్రాక్ట్ ఇంఫెక్షన్. వీటినే యూటీఐలు అని అంటారు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ అంట. మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్ ఖళీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అదే తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి, పురుషుల్లో అంగం మీద స్థలంలో నొప్పి .. ఇలాంటి సమస్యలు ఎన్నోవస్తాయి. అటుచేసి ఇటుచేసి మీ కిడ్ని ప్రమాదంలో పడుతుంది. మిమ్మల్ని చావుకి దగ్గర చేస్తుంది.

మూత్రాన్ని అలాగే ఆపి పట్టడం వలన యురేత్ర నుంచి కిడ్నీలోకి బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో ఇంఫెక్షన్లు మొదలవుతాయి. యూటీఐ మాత్రమే కాదు, ఇంకెన్నో ఇన్ఫె క్షన్స్ ఉంటాయి. ఎంతసేపు ఆపిపెడితే బ్యాక్టీరియా అంత ఎక్కువ పెరుగుతుంది. బ్యాక్టీరియా ఎంత ఎక్కువ పెరిగితే ఇంఫెక్షన్ అంత ఎక్కువ పెరుగుతాయి. దాంతో కిడ్నిల పనితనం మందగిస్తుంది. మలినాలు సరిగా బయటకివెళ్ళవు, టాక్సిన్స్ అలానే ఉండిపోతాయి, స్త్రీలలో డిశ్చార్జ్ తో దుర్వాసన రావొచ్చు. మూత్రం రంగు మారిపోతుంది. చివరకి కిడ్నీ ఫేల్యూర్ దాకా సమస్య వెళ్ళవచ్చు. అదే జరిగితే ఇక మీ జీవితపు చివరి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.

అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్ గా తీసుకోవాలి. దూరపు ప్రయాణాలు బస్సుల్లో చేసినప్పుడు, ఆఫీసు మీటింగ్స్ ఉన్నప్పుడు ఎంత తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నామో ఆలోచించాలి. రెండు నిమిషాల కోసం ఆలోచిస్తే, అది మీ ప్రాణాలకే ప్రమాదం.