Begin typing your search above and press return to search.

లోకేష్‌ను అనుస‌రిస్తే.. `వైసీపీ` ఖేల్ ఖ‌తం-దుకాణం బంద్ అవుతుందా!

By:  Tupaki Desk   |   24 April 2021 12:30 PM GMT
లోకేష్‌ను అనుస‌రిస్తే.. `వైసీపీ` ఖేల్ ఖ‌తం-దుకాణం బంద్ అవుతుందా!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గ‌తంలో ప్లే చేసిన వ్యూహాన్నే అనుస‌రిస్తోందా? ఇలా అయితే.. క‌ష్టాలు కొని తెచ్చుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. మంత్రిగా ఉన్న నారా లోకేష్‌.. చాలా క‌థే న‌డిపించారు. ఈ క‌థే.. పార్టీని స‌మూలంగా పాతిపెట్టింద‌నే.. విశ్లేష‌కులు చెబుతున్నారు. అప్ప‌ట్లో అంటే.. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీని టార్గెట్ చేసుకుని.. టీడీపీ రాజ‌కీయాలు చేసింది.

అప్ప‌ట్లో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి తీసుకోవ‌డంలో నారా లోకేష్ చ‌క్రం తిప్పా రు. అదేవిధంగా వీరిలో న‌లుగురికి మంత్రి ప‌దవులు కూడా ఇచ్చారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల‌పై అప్ప‌ట్లో అనేక కేసులు కూడా పెట్టించారు. ఇక‌, వైసీపీ అధినేత‌, అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో పాల్గొనేందుకు విశాఖ‌ప‌ట్నం వెళ్తే.. ఆయ‌న‌ను విమానాశ్ర‌యంలోనే అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేశారు. ఇలా.. లోకేష్ అప్ప‌ట్లో తెర‌వెనుక ఉండి వైసీపీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు.

ఈ విష‌యాన్ని ఇప్ప‌టికీ వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తుంటారు. త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు లాగేసుకుని త‌ప్పు చేశాడంటూ.. అసెంబ్లీ కూడా వ్యాఖ్యానించారు. ఇక‌, ఇది న్యూట‌న్ థ‌ర్ఢ్ లా ప్ర‌కారం.. `బంతిని ఎంత బ‌లంగా గోడ‌కేసి కొడితే.. అది అంత బ‌లంగా రివ‌ర్స్ అవుతుంది` అనే ఫార్ములా వైసీపీ విష‌యంలో రుజువైంది. అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎంత కేడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ పార్టీ ఓడిపోయింది.

ఇక‌, ఇప్పుడు వైసీపీ కూడా అచ్చు.. లోకేష్ ఫార్ములానే అనుస‌రిస్తోంద‌ని అ్ంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ ని తొక్కేయాల‌ని.. నామ‌రూపాలులేకుండా చేయాల‌ని.. ప్ర‌య‌త్నిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. అంతేకాదు.. అపుడే ఏమైంది ముందుంది ముసళ్ళ పండుగ అని వైసీపీ నేతలు హింట్ ఇస్తున్నారు. పదమూడు జిల్లాల్లోని బడా నాయకులు, టీడీపీకి అన్ని విధాలుగా దన్నుగా ఉన్న వారిని ఏరివేసే భారీ సర్పయాగమే ఇపుడు జరుగుతోంది. ఒక విధంగా టీడీపీ కూశాలు కదిలించాలన్నదే జగన్ ఎత్తుగడ.

ఈ సర్పయాగంలో పాములన్నీ కూడా ఎక్కడ చేరి ఎవరి సింహాసన్నాన్ని అల్లుకుని ఉన్నాయో ఆ మూల పురుషుడిని కూడా వాటితో పాటే బయటకు తీసుకురావాలన్నదే అతి పెద్ద టార్గెట్. అయితే.. టీడీపీకి కేడ‌ర్ ఎక్కువ‌. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌డంతోపాటు..అభ్య‌ర్థుల‌ను కూడా త‌యారు చేసుకునే ప‌రిస్థితి ఉంది. సో.. ఇప్పుడు వైసీపీ అనుస‌రిస్తున్న లోకేష్ ఫార్ములా.. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి రివ‌ర్స్ అయితే.. తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయం వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. అదేస‌మ‌యంలో కేడ‌ర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. సో.. రేపు కొంద‌రు టీడీపీ వైపు యూట‌ర్న్ తీసుకుంటే.. వైసీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారవుతుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా క‌క్ష సాధింపు చేస్తే.. రాజ‌కీయాల్లో క‌ష్టాలు.. త‌ప్ప‌.. లాభం ఉండ‌ద‌ని వైసీపీ పెద్ద‌లు గుర్తుంచుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌తంలో టీడీపీ ఈవిధంగా అతిగా అడ‌గులు వేసి.. తీవ్రంగా దెబ్బ‌తింది. ఈ ప‌రిణామాన్ని దృష్టిలో పెట్టుకుని.. వైసీపీ అడుగులు వేయాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.