Begin typing your search above and press return to search.
బుల్లెట్ బండి కఫుల్ వేములవాడ గుడికి వచ్చినప్పుడు ఏమైంది?
By: Tupaki Desk | 20 Aug 2021 2:18 PM GMTగతంలో ఫేమస్ కావాలంటే ఎంతో ప్రయత్నం.. మరెంతో కష్టం చేయాల్సిన పరిస్థితి. కానీ.. ఇప్పుడు అంతా మారిపోయింది. సగటుజీవుల మనసుల్ని దోచుకోవాలే కానీ.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోయే పరిస్థితి. ఇప్పటికే పలువురు ఇదే రీతిలో సోషల్ మీడియా సెలబ్రిటీలుగా.. స్టార్లుగా మారిపోవటం.. ఓవర్ నైట్ ప్రముఖులుగా మారిపోవటం తెలిసిందే. మూడు రోజుల క్రితం పెళ్లి ఊరేగింపు (బారాత్ లో)లో భాగంగా రోటీన్ కు భిన్నంగా పెళ్లి కుమార్తె రోడ్డు మీద చేసిన డ్యాన్స్ పెను సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియా దుమ్ము రేపింది.
'బుల్లెట్ బండి'పాట ఏప్రిల్ ఏడున యూట్యూబ్ లో విడుదలైంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడిన ఈ పాట ఇప్పటికే నెట్టింట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ పాటను.. ఈ నెల 14న పెళ్లైన నూతన జంట (అశోక్.. సాయిశ్రీయ) రోడ్డు మీద డ్యాన్స్ వేయటం.. ఆ సందర్భంగా పెళ్లి కుమార్తె వేసిన స్టెప్పులకు విపరీతమైన ఆదరణ లభించింది.
రాత్రికి రాత్రి ఈ జంట సోషల్ మీడియా స్టార్లుగా అవతరించారు. పెళ్లి అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వారు ఈ రోజు ఆలయానికి వచ్చారు. దర్శనానికి వచ్చిన ఈ జంటను చూసిన భక్తులు.. వారిని చూసేందుకు ఎగబడ్డారు. అంతేకాదు.. వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. సోషల్ మీడియా తీసుకొచ్చిన ఇమేజ్ వారినెంత పాపులర్ చేసిందన్న విషయం వేములవాడ గుడి వద్ద వారికి లభించిన ఆదరణ చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.