Begin typing your search above and press return to search.
వైసీపీకి ఏమైంది?
By: Tupaki Desk | 26 Aug 2020 6:45 AM GMTనిన్న టీడీపీకి సపోర్ట్ గా ఉండే ఒక పత్రిక.. అనంతపురం ఎడిషన్ లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ లో వైసీపీలో నైరాశ్యం అని రాసేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ అసంతృప్తిలో ఉన్నారని రాసుకొచ్చారు. అయితే ఏదో ఆ పత్రికలో కథనం వచ్చిందని అంతా నిజం అనుకొని టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి మరీ దాన్ని వైరల్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ దీనిని ఖండించకుండా వైసీపీ సోషల్ మీడియా టీం.. టీడీపీ వాళ్ల ట్రాప్ లో పడి ఆ ఆర్టికల్ ను వైసీపీకి అనుకూలంగా ఉన్న పేజీలలో షేర్ చేయడంతో అభాసుపాలయ్యారు. అలా గ్రామాల్లో ఉన్న వైసీపీ నాయకులంతా దీన్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుంటున్నారట...
ఇది కాస్త నిన్న మొత్తం వైసీపీ అధిష్టానం వరకు చేరిపోయిందని సమాచారం. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు ఈ వాట్సాప్ మెసేజ్ లపై సీరియస్ అయ్యారట.. మా నియోజకవర్గాల్లో ఇలా జరగడం ఏంటని.. దీన్ని వైసీపీ నేతలే కరెక్ట్ అంటూ ప్రచారం చేయడం ఏంటని వైసీపీ సోషల్ మీడియా టీంపై మండిపడ్డారంట.. పార్టీ అంతర్గత విషయాలపై అవగాహన లేకుండా వైసీపీ సోషల్ మీడియా టీం ఇలా పార్టీని డ్యామేజ్ చేసేలా ప్రచారం చేయడం ఏంటని నిలదీశారట..
ఇదంతా గమనిస్తున్న టీడీపీ టీం.. మెసేజ్ లను అర్థం చేసుకోకుండా మా ట్రాప్ లో పడ్డారు అని సంబరాలు చేసుకుంటున్నారట.. వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంలో తేలిపోయిందని.. టీడీపీ వాళ్ల ట్రాప్ లో పడకుండా చూసుకోవాలని.. వారికి అవగాహన పెంచాలని వైసీపీ వర్గాలు వాపోతున్నాయట.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అందరినోటా వినిపిస్తోంది.