Begin typing your search above and press return to search.

తిరుపతి కి ఏమైంది? మొన్న వందల ఏళ్ల చెట్టు.. ఇప్పుడేమో ఇలా!

By:  Tupaki Desk   |   16 Jun 2023 6:29 PM GMT
తిరుపతి కి ఏమైంది? మొన్న వందల ఏళ్ల చెట్టు.. ఇప్పుడేమో ఇలా!
X
టెంపుల్ సిటిగా పేరున్న తిరుపతికి ఏమైంది? ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాలు తిరుపతి వాసులకు మనో వ్యధకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రెండు ఉదంతాలు నిత్యం భక్తులతో కళకళలాడే గోవిందరాజస్వామి టెంపుల్ వద్దే చోటు చేసుకోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.

మొన్నటికి మొన్న గోవిందరాజ స్వామి ఆలయంలోని వందల ఏళ్ల నాటి చెట్టు ఒక్కసారిగా కూలిపోవటం.. దానికి కాస్త ముందు అక్కడి దేవాలయ గజరాజులు ఘీంకారాలు చేస్తూ హెచ్చరించటం తెలిసిందే.

ఆ ఉదంతం నుంచి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు భక్తులు. తాజాగా మళ్లీ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. కాకుంటే.. గోవింద రాజ స్వామి ఆలయానికి బయటనే. కొద్ది కాల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు ఉదంతాలు తిరుపతి వాసులకు ఆందోళనకు కలిగిస్తున్నాయి. గోవిందరాజ స్వామి ఆలయానికిసమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్ దుకాణంలో మంటలు చోటు చేసుకుంది.

నిత్యం రద్దీగా ఉండే ప్రమాదం చోటు చేసుకోవటం.. తక్కువ వ్యవధిలో మంటలు ఇళ్ల వైపు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాసేపటికే మంటలు గోవిందరాజ స్వామి ఆలయం రథం వైపు వస్తుండటంతో ఆందోళనకు గురయ్యారు.

అయితే.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లావణ్య ఫోటోఫేమ్ వర్కు ను ఐదంతస్తుల భవనంలోని ఒక ఫ్లోర్ లో నిర్వహిస్తున్నారు.

విద్యుద్ఘాతంతో ఈ ఉదంతం చోటు చేసుకుందని చెబుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది రూపాయిల విలువైన ఫోటోలు దగ్థమైనట్లుగా చెబుతున్నారు. మంటల తాకిడికి మరో భవనం ముందున్న ఐదు టూ వీలర్ వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లుగా చెబుతున్నారు. మంటలు చెలరేగటంతో ఫోటో ఫ్రేమ్ వర్కు షాపులో పని చేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

భవనంలో ముగ్గురు చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది. ఏమైనా.. గోవిందరాజ స్వామి టెంపులకు వద్దే వరుస ఘటనలు చోటు చేసుకోవటం తిరుపతి వాసుల్ని కలవరపాటుకు గురి చేస్తోంది.