Begin typing your search above and press return to search.

శశికళకు ఏమైంది.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

By:  Tupaki Desk   |   20 Jan 2021 9:50 PM IST
శశికళకు ఏమైంది.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్
X
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బుధవారం అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు.

శిక్ష పూర్తి చేసుకొని వచ్చే వారమే శశికళ విడుదల కానుంది. కానీ అంతలోనే జరగడం.. జైలులో ఆరోగ్యకేంద్రం ఉన్నప్పటికీ ఆమెను పెద్ద ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

గడిచిన 10 రోజులుగా శశికళ జ్వరం, నీరసంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. జైలులో చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోలేకపోయారని.. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ బాగా పడిపోవడంతో మరోదారి లేక ఆమెను బోరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కాగా కరోనా నిబంధనల కారణంగా గడిచిన 10 నెలలుగా బంధువులెవరినీ శశికళతో కలవనీయలేదని.. ఆమె ఎలా ఉన్నారన్న సంగతి బయట వాళ్లెవరికీ తెలియదని వెల్లడైంది.