Begin typing your search above and press return to search.
పుష్ప శ్రీవాణికి ఏమైంది.. ఇంత వ్యతిరేకత వెనుక రీజనేంటి...?
By: Tupaki Desk | 8 July 2023 9:42 AM GMTవైసీపీ కీలక నాయకురాలు.. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి సెగ భారీగా పెరుగుతోంది.. తగులుతోంది కూడా! ఆమె ఎక్కడకు వెళ్లినా.. గిరిజన సంఘాల నాయకులు, గిరిజన యువత కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం.. ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమాన్ని వారు చెబుతున్నారు.
అయితే.. అనూహ్యంగా చాలా మందికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతోంది. ఇది ఎస్సీ, ఇతర నియోజకవర్గాల్లో కామన్‌గా కనిపిస్తున్న విషయమే. కానీ, గిరిజన నియోజకవర్గాల్లో ప్రజలు ఒక ఎమ్మెల్యేను నమ్మతే.
ఇక, దాదాపు ఆ ఎమ్మెల్యేపై అంతే ప్రేమ చూపిస్తారు. కానీ.. ఇప్పుడు కురుపాం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్నప్పటికీ మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నాయకురాలు పుష్ప శ్రీవాణికి సెగ మాత్రం జోరుగా తగులుతోంది.
గడప గడపకు’ కార్యక్రమంలో ఆమెను చుట్టుముడుతున్న గిరిజన సంఘాల నేతలు, యువత కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడు నుంచి దుడ్డుకల్లు(ఇది పూర్తిగా వైసీపీకి కంచుకోట) వరకు కూడా ఎమ్మెల్యేను తమ గ్రామానికి రావద్దంటూ గిరిజనులు నిరసన తెలపడం.. ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి మన్యం జిల్లాలోని దుడ్డుకల్లు, చింతలపాడు గ్రామాలు. పూర్తిగా వైసీపీకి అనుకూలం.
అలాంటి చోట పుష్ప శ్రీవాణికి ఓ రేంజ్‌లో ఎదురుదెబ్బ తగలడం ఆశ్చర్యంగాను.. విస్మయాత్మకంగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక, ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నవారు.. రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఒకటి.. గిరిజన రిజర్వేషన్ అనే తేనె తుట్టెను జగన్ కదపడం.. దీనిని అడ్డుకోకుండా.. దిక్కులు చూడడం అనేది కారణం అయితే.. రెండు.. పుష్ప శ్రీవాణి .. తమ గిరిజన ప్రాంతానికి ఏమీ చేయలేకపోయారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ వ్యతిరేకతను ఆమె ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి.