Begin typing your search above and press return to search.
సెల్ఫీ వీడియోలతో తెర మీదకు వచ్చిన దుబాయ్ యువరాణి
By: Tupaki Desk | 17 Feb 2021 6:31 AM GMTకొన్నేళ్ల క్రితం దుబాయ్ రాణి ఒకరు రాజసౌధం నుంచి పారిపోయి.. రహస్యంగా విదేశాలకు పారిపోతున్న వేళ.. భారత సముద్ర జలాల్లో ఆమెను అదుపులోకి తీసుకోవటం.. ఆ తర్వాత దుబాయ్ రాజు వినతి మేరకు ఆమెను అప్పగించటం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన ఆ రాణి పేరు లతీఫా. తాజాగా ఆమె మరోసారి తెర మీదకు వచ్చారు. భారత ప్రభుత్వం ఆమెను దుబాయ్ రాజుకు అప్పజెప్పిన తర్వాత.. ఆమెను బందీగా ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు బయటకు రాలేదు.
తాజాగా ఆమెకు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అది కూడా సదరు రాణి లతీఫా ధైర్యం చేసి.. రహస్యంగా సెల్ఫీ వీడియోల్ని పంపటంతో.. అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. లతీఫా తండ్రి మహమ్మద్ బిన్ రషీద్ కోరినట్లుగా కాకుండా.. తన సొంత బతుకు బతకాలని భావించి.. దుబాయ్ రాజసౌధం అనే చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయింది.
అప్పటి నుంచి ఆమె నరకప్రాయమైన జీవితాన్ని సాగిస్తున్నారు. ఒక భారీ విల్లాలో ఆమెను బంధీగా ఉంచుతున్నారు. ఆమె తాజా పరిస్థితి ఏమంటే.. కట్టుదిట్టమైన భద్రత సిబ్బంది పహరా కాస్తుంటే.. వారి నీడన ఆమె బతుకు బండి లాగాల్సిన దుస్థితి. విల్లా నుంచి బయటకు వచ్చి.. స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చేలేని దుస్థితిలో తాను ఉన్నట్లు లతీఫా తాజాగా విడుదల చేసిన రహస్య వీడియో క్లిప్ లో పేర్కొన్నారు.
విల్లాను ఆమె కోసం జైలులా మార్చేసి.. అందులో ఫుల్ గా సెక్యురిటీ గార్డుల్ని పెట్టేసి.. పహరా కాస్తున్నారు. ఆమె తనకు తానుగా ఒంటరిగా.. ఏకాంతంగా ఉండగలిగిన ప్రదేశం.. ఆ విల్లాలోని బాత్రూం మాత్రమే అని వాపోతున్నారు. ఇంటి బయటా.. లోపలా భద్రతా సిబ్బంది ఉంటారని.. తాను ఫోన్ వినియోగించలేనని చెబుతున్నారు. ఎవరికి తెలీకుండా రహస్యంగా తన పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించే గ్రూపు నుంచి అందే సహకారంతో ఆమె సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. తాను రికార్డు చేసిన వీడియోల్ని బయటకు పంపుతుండటం.. తన జీవితం ఎంత దుర్భరంగా ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. తానుపంపుతున్న వీడియోలన్ని బాత్రూంలో రికార్డు చేసినవని.. అక్కడకుమాత్రమే భద్రతా సిబ్బంది తన వెంట రారని ఆమె పేర్కొంది. మరి.. బందీగా ఉన్న యువరాణి లతీఫాను బయట ప్రపంచంలోకి ఎప్పుడు వస్తుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి..ఆమెకు అపన్న హస్తం అందించే మొనగాడే లేడా? స్వేచ్ఛ గురించి.. వ్యక్తిగత హక్కుల గురించి అదే పనిగా లెక్చర్లు పీకే వారు.. ఇంతకాలంగా యువరాణి బయటకు రాకపోవటంపైన ఆందోళనలు ఎందుకు చేయనట్లు? రహస్యంగా ఉండిపోయిన ఆమెకు స్వేచ్ఛను ఎందుకు ప్రసాదించనట్లు?