Begin typing your search above and press return to search.
నారా లోకేష్ భుజానికి గాయం.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 18 March 2023 1:54 PM GMTటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం యువగళం పాద యాత్రలో ఉన్న నారా లోకేష్ కు సంఘీభావం ప్రకటించేందుకు భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించడంతో పార్టీ నాయకులు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలకాలని భావించారు. అయితే.. ఈ క్రమంలో భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల ఒత్తిడితో లోకేష్ పై భారం పడింది.
ఈ క్రమంలోనే నారా లోకేష్ భుజాలకు గాయమైనట్లు తెలిసింది. రెండు భుజాలకు గాయం కారణంగా సెల్ఫీ లు కూడా తీసేందుకు వీలుకాకపోవడంతో ఇతరుల సహాయంతో లోకేష్ సెల్ఫీలు తీయిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఈ రోజు సాయంత్రం వైద్యం చేయించుకుంటారని.. టీడీపీ నాయకులు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. 46వ రోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది.
కదిరి నియోజకవర్గం చీకటి మానుపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలైంది. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా లోకేష్ కు టీడీపీ శ్రేణులు భారీగా ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 587 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. చీకటి మానుపల్లి విడిది కేంద్ర వద్దకు భారీగా చేరుకున్న కదిరి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు లోకేష్ తో సెల్ఫీల కోసం బార్లు తీరిన పరిస్థితి నెలకొంది.
ఇదిలావుంటే.. తాజాగా ఉత్తరాంధ్రలోనూ, సీమ జిల్లాల్లోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో యాత్రకు మరింత జోష్ పెరగడం గమనార్హం. ఎక్కడెక్కడ నుంచో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు చేరుకు ని సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో నారా లోకేష్ పై సహజంగా నే ఒత్తిడి పెరిగిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.