Begin typing your search above and press return to search.

పోలీస్ కంట్రోల్ లో జయకు చికిత్స!

By:  Tupaki Desk   |   1 Oct 2016 10:08 AM GMT
పోలీస్ కంట్రోల్ లో జయకు చికిత్స!
X
తమిళనాడు సీఎం - తమిళ ప్రజల అమ్మ జయలలితకు ఏమైంది.. 68 ఏళ్ల వయసులో వరుసగా రెండోసారి అధికారం చేపట్టి రికార్డులు తిరగరాయడమే కాకుండా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం సాధించుకున్న ఆమె గత తొమ్మిది రోజులుగా ఎందుకు కనిపించడం లేదు.. ఆమె ఆరోగ్యంపై ఎందుకంత రహస్యం మెంటైన్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలు తమిళనాడులోనే కాదు, దేశమంతా వ్యక్తమవుతున్నాయి. జయకు ఏదో జరిగింది.. పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న ఆందోళన అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలు అందుకు మరింత ఊతమిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అంత బాలేనట్లుగా అనుమానిస్తున్నారు.

తొమ్మిది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరిన త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించ‌డానికి విదేశీ వైద్యులు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. లండన్‌ కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటెన్సివిస్ట్‌ డా.రిచర్డ్‌ జాన్‌ బేలే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రిచర్డ్‌ పర్యవేక్షణలోనే ఆమెకు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ ప‌రీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని వైద్యులు తెలిపారు.

కాగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన హెల్త్ బులిటిన్ విడుదల కాకపోవడంతో వదంతలు వ్యాపిస్తున్నాయి. అభిమానులు అమ్మ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రి ముందే హోమం నిర్వహించారు. మరో వైపు చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద దాదాపు వెయ్యి మంది పోలీసులను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఆంక్షలు విధించారు. కాగా సీఎం ఆరోగ్య పరిస్థితి ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఉందంటూ అక్కడి విపక్ష నేత కరుణానిధి డిమాండ్ చేస్తున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా వేల మంది పోలీసులను మోహరించడంతో ఏమైనా దుర్వార్త వినాల్సి వస్తుందా అని తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెన్నై మొత్తం పరిస్థితి గంభీరంగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/