Begin typing your search above and press return to search.
అఖిలప్రియ వెళ్లిపోయిన కాసేపటికి గాంధీలో ఏమైంది?
By: Tupaki Desk | 7 Jan 2021 3:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం గాంధీకి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం 11 గంటల వేళలో అరెస్టు చేసిన ఆమెను.. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కొద్ది గంటల పాటు అధికారులు విచారణ జరిపారు.
అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె గర్భవతి అన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. ఆమెకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. గాంధీ ఆసుపత్రి నుంచి భూమా అఖిలప్రియ వెళ్లిన కాసేపటికి గాంధీ ఆసుపత్రిలో విద్యుచ్ఛక్తి నిలిచిపోయింది. దీంతో.. కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలోని మూడో అంతస్తులోని ఆపరేషన్ గదిలో షాట్ సర్య్కుట్ చోటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో.. వైద్య పరికరాలు కాలిపోవటంతో పాటు.. వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితే భూమా అఖిలప్రియ గాంధీలో ఉన్నప్పుడు చోటు చేసుకుంటే.. భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవన్న మాట వినిపిస్తోంది.