Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది? నిజానిజాలు ఇవే!
By: Tupaki Desk | 20 March 2023 2:00 PM GMTఔను! ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది? ఎమ్మెల్యేలు తన్నుకున్నారా? ఎవరు ఎవరిపై దాడి చేశారు? ఎలా తన్నుకున్నారా? ఇదీ.. ఇప్పుడు ఏపీలోనే కాదు..పొరుగున ఉన్న తెలంగాణలోనూ ఆసక్తిగా మారిన చర్చ. ఏ ఇద్దరు కలిసినా.. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో పరిణామాల పైనే చర్చించుకుంటున్నారు. ఈ నెల 14న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు కారాలు మిరియాలు నూరుతున్న మాట వాస్తవమే.
అయితే.. ఈ వివాదాలు.. తన్నుకునే వరకు వెళ్లాయా? అనేదే ప్రశ్న. ఎద్దు ఈనిందంటే.. దూడను కట్టేయ మన్నట్టుగా ఉన్న సోషల్ మీడియా వార్తల ఫలితంగా అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా పుకార్లకు ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే కనిపించింది. సోమవారం(అంటే ఈరోజు) ఉదయం సభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1పై ప్రతిపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది.
అయితే.. దీనిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సహజంగానే.. పోడియం చుట్టూ చేరి.. ఆందోళనకు నిరసనకు దిగారు. ఇది కూడా సాధారణమే. ఎందుకంటే గత నాలుగు రోజులుగా ఏదో ఒక విషయంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరంపరలోనే తాజాగా కూడా ఇదే చేశారు. అయితే.. సోమవారం.. ఒకింత దూకుడుగా వ్యవహరించారనేది వాస్తవం.
స్పీకర్ చుట్టూ చేరి.. జీవో 1 ప్రతులను చించేసి.. స్పీకర్ నెత్తిన విసిరేశారు. అవి స్పష్టంగా కనిపించాయి. ఇక, ఇంతలోనే ఎటు నుంచి వచ్చాయో తెలియదు కానీ.. ప్లకార్డు కూడా అసెంబ్లీలో కి వచ్చాయి. (వీటిపై కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడే నిషేధం విదించారు) ఈ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీటిలో టీడీపీ సభ్యుడు డోలా బాల వీరాంజనేయ స్వామి పట్టుకున్న ప్లకార్డు.. స్పీకర్ ముఖాన్ని కప్పేసింది.
ఇక్కడ అసలు రగడ మొదలైంది. వెంటనే సంతనూతల పాడు ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్‌బాబు హుటాహుటిన పోడియం వద్దకు వెళ్లి.. డోలా స్వామి పక్కకు లాగేశారు. ఈ క్రమంలో సుధాకర్‌బాబు, డోలా ఇద్దరూ కింద పడిపోయారు. దీనిని ఖండిస్తూ.. సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పోడియంలో కి వెళ్లేందుకు పరుగు పరుగున వెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనను నిలువరించారు. ఈ క్రమంలో బుచ్చయ్య , వెల్లంపల్లి అరుచుకున్నారు. మెట్టుపై నిలబడిన వెల్లంపల్లి కూడా జారి కింద పడ్డారు. ఇదీ.. జరిగింది.
ఆ వెంటనేసభలో తీవ్ర వివాదాలు.. వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అనంతరం సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమయ్యాక.. టీడీపీ సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేస్తూ.. తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇదీ.. జరిగింది. అంతే తప్ప.. ఎమ్మెల్యేలు తన్నుకున్నారనడంలో నిజం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.