Begin typing your search above and press return to search.
వెలగపూడిలో అర్థరాత్రి అంత్యక్రియల వెనుక ఏం జరిగింది?
By: Tupaki Desk | 29 Dec 2020 6:45 AM GMTచిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన వైనం తెలిసిందే. అమరావతి పరిధిలోని వెలగపూడిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఏపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అయితే.. హోంమంత్రి సుచరిత స్వయంగా రంగంలోకి పరిస్థితిని కంట్రోల్ చేయటంతో పాటు.. వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఎంట్రీతో అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న 50 ఏళ్ల మరియమ్మ అంత్యక్రియలు సోమవారం అర్థరాత్రి ఒంటి గంట వేళ పూర్తి చేశారు. ఇంతకీ.. అసలీ వివాదం ఏమిటన్నది చూస్తే..
వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో కొత్తగా సిమెంటు రోడ్డు వేశారు. దాని ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆర్చీకి ఏం పేరు పెట్టాలన్న దానిపై ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవి కాస్తా పెరిగి.. ఘర్షణ వరకు వెళ్లాయి. ఊళ్లోని రెండు వర్గాల మధ్య పేరు మీద లొల్లి మొదలైంది. ఒక వర్గం వారు బాబు జగ్జీవన్ రాం పేరు పెట్టాలని భావిస్తే.. మరో వర్గం నో చెప్పింది. దీనిపై శనివారం నుంచి చర్చలు జరగటం.. ఉద్రిక్తలు చోటు చేసుకోవటం జరిగింది. ఆదివారం మరోసారి చర్చకు కూర్చోవటం.. విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
దీంతో.. ఒకరిపై ఒకరు రాళ్లు.. ఇటుక పెళ్లలు విసురుకున్నారు. దీంతో సంబంధం లేని మరియమ్మ ఇంటి ముందు అంట్లు తోముతుంటే.. రాళ్లు వచ్చి తగిలాయి. దీంతోఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రికి తరలించగా అర్థరాత్రి వేళ ఆమె మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. మరో ముప్ఫై మందికి దెబ్బలు తగిలాయి. దీంతో.. బాధిత మహిళ వర్గానికి చెందిన వారి ఆందోళనతో వెలగపూడి అట్టుడికిపోయింది.
ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ నందిగం సురేశ్ ఉన్నారని.. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఆందోళన సాగింది. ఈ గొడవల వెనుక వెలగపూడి పోలీసుల అత్యుత్సాహం ఉందన్న విమర్శలు వినిపించాయి. నిరసనలు అంతకంతకూ పెరిగిపోవటంతో.. ఏపీ హోం మంత్రి సుచరిత రంగంలోకి దిగారు. ఎంపీ సురేశ్ పేరును ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హోంమంత్రి హామీ ఇవ్వటంతో నిరసకారులు శాంతించారు. దీంతో.. అర్థరాత్రి వేళ.. అప్పటికప్పుడు మరియమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.