Begin typing your search above and press return to search.
మోడీతో పవన్ భేటీకి ముందు ఏం జరిగింది? భేటీ వేళ ఏమైంది?
By: Tupaki Desk | 12 Nov 2022 4:20 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోడీ కొడుకు మాదిరి ట్రీట్ చేస్తారని.. ఆయన విషయంలో మోడీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని కేంద్ర మంత్రులు పలువురు వ్యాఖ్యానించటం తెలిసిందే. అలాంటిది ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్న వేళ.. తన పర్యటనకు రెండు రోజులు మందు తమ మిత్రుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తనను కలవాల్సిందిగా పేర్కొంటూ పీఎంవో నుంచి సమాచారం రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు.. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. ఇందుకోసం ప్రత్యేకంగా విశాఖకు వచ్చిన పవన్.. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం అరగంట పాటు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని ముందుకు పవన్ పలు విషయాల్ని తెచ్చినట్లుగా తెలుస్తోంది.
మోడీతో భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్.. ఆచితూచి అన్నట్లు మాట్లాడారు. తాను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేసి.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు. సహజంగా.. మీడియా అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పే పవన్.. తన తీరుకు భిన్నంగా ఎక్కువ మాట్లాడకుండా వెళ్లిపోవటం గమనార్హం.
తన భేటీ సందర్భంగా.. ఏపీలోని పరిస్థితుల గురించి ప్రధాని నరేంద్ర మోడదీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రధానితో తన భేటీ ఏపీకి భవిష్యత్తులో మంచిరోజులు వస్తాయని తాను అనుకుంటున్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు.
ఏపీకి మంచి భవిష్యత్తునకు తమ సమావేశం అవకాశం ఇస్తుందన్నారు. మొత్తంగా చూస్తే.. తనకు తానుగా పవన్ ను పిలిపించుకొని.. భేటీ అయిన ప్రధాని ఆయనతో అరగంట పాటు గడపటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.