Begin typing your search above and press return to search.
భోజనం వేళలో ఆ శాఖ మహిళా ఉద్యోగినులతో కేసీఆర్ ఏం మాట్లాడారు?
By: Tupaki Desk | 25 Jan 2021 9:40 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడెలా వ్యవహరిస్తారో అర్థం కాదు. ఆది.. సోమ అన్న తేడా లేకుండా రోజుల తరబడి ఫాంహౌస్ లో ఉండే ఆయన.. అప్పుడప్పుడు రోజులతో సంబంధం లేకుండా వరుస సమావేశాల్ని నిర్వహిస్తుంటారు. సాధారణంగా వీకెండ్ వేళ.. అధికారిక సమావేశాన్ని నిర్వహించటం తక్కువగా ఉంటుంది. కానీ.. సీఎం కేసీఆర్ కు ఎప్పుడు ఏది అనిపిస్తే.. చటుక్కున ఆ పని మీద ఫోకస్ పెడతారు. ఆదివారం వేళ.. వ్యవసాయ.. మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిపి ప్రగతిభవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సారుతో సమావేశం అంటే గంటల కొద్దీ సాగటం ఖాయం.
లంచ్ బ్రేక్ తప్పనిసరి. అందుకు తగ్గట్లే వ్యవసాయ.. మార్కెటింగ్ శాఖ అధికారులతో మీటింగ్ సందర్భంగా లంచ్ ఏర్పాటు చేశారు. సమావేశ సమయంలో మాట్లాడలేని అంశాలు.. ముఖ్యమంత్రిగా నేరుగా చర్చించలేని విషయాల్ని భోజన విరామంలో మాట్లాడే అరుదైన అవకాశం లభిస్తుంటుంది. అందుకు తగ్గట్లే.. తాజా రివ్యూ సందర్భంగా వ్యవసాయ.. మార్కెటింగ్ శాఖకు చెందిన మహిళా ఉద్యోగుల వద్దకు సీఎం కేసీఆర్ పలుకరింపుగా వచ్చారు.
ఈ సందర్భంగా వారు తమకు ఎదురవుతున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోమహిళా ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల భద్రత.. వారికి అవసరమైన సౌకర్యాలు.. ఏర్పాట్ల కోసం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు బాధ్యతల్ని అప్పగించారు. వారి సంగతుల్ని చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పటంతో మహిళా ఉద్యోగులు సంతోషానికి గురయ్యారు. ఏ విషయానికి ఎలా స్పందించాలన్న విషయంలో సీఎం కేసీఆర్ తీరు భిన్నమన్న మాట తాజా ఉదంతంతో మరోసారి రుజువైనట్లేనని చెప్పక తప్పదు.