Begin typing your search above and press return to search.

ఒక్క సీఎం ఐదేళ్లు లేడు.. కర్ణాటక బీజేపీకి శాపం?

By:  Tupaki Desk   |   27 July 2021 2:28 PM GMT
ఒక్క సీఎం ఐదేళ్లు లేడు.. కర్ణాటక బీజేపీకి శాపం?
X
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా పట్టుమని ఐదేళ్లు పూర్తిస్థాయిలో పాలించిన దాఖలాలు అస్సలే లేవు. ఏ రాష్ట్రంలోనైనా ఐదేళ్లు సీఎంగా పూర్తి చేసుకుంటారు. చాలా మంది రెండు మూడు సార్లు సీఎంలు అయిన వారు ఉన్నారు.కానీ అనిశ్చితికి మారుపేరైన కర్ణాటకలో మాత్రం ఏదో ఒక కారణంతో ఆ సీఎంలు దిగిపోతున్నారు. అవినీతి ఆరోపణలతో సీఎం సీటును కోల్పోతున్నారు. కర్ణాటకలో బీజేపీకి ఇదో శాపంగా మారిందని బీజేపీ శ్రేణులు మథనడపుతున్నాయట..

దక్షిణాదిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే. ఇక్కడ బలంగా ఉన్న బీజేపీకి సీఎం క్యాండిడేట్లు శరాఘాతంగా మారారు. మొదటి సారి 2004లో 224 సీట్లలో అత్యధికంగా 79 సీట్లు గెలుచుకొని తొలిసారి బీజేపీ ఇక్కడ గెలిచింది. అయితే కాంగ్రెస్+జేడీఎస్ పార్టీలు ఒక్కటవ్వడంతో బీజేపీ అధికారం కోల్పోయింది.

ఆ తర్వాత జేడీఎస్ తో కలిసి 2007లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప సీఎం అయ్యారు. కానీ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సీఎంలుగా బాధ్యతలు తీసుకున్న బీజేపీ సీనియర్లు ఎవరూ సీఎం పదవిని పూర్తి కాలం అనుభవించలేదు. యడ్డీ తర్వాత సీఎం అయిన సదానందగౌడ కూడా మధ్యలోనే రాజీనామా చేశారు.

ఇక ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ తరుఫున సీఎం అయిన జగదశ్ షెట్టర్ కూడా మధ్యలోనే పదవిని కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ యడ్యూరప్ప అయ్యారు. ఆయన కూడా పదవీకాలం పూర్తికాకుండా దిగిపోయాయి. వరుసగా మూడు సార్లు సీఎం అయ్యి ఐదేళ్లు పాలించనది యడ్డీ మాత్రమే.

కర్ణాటకలో ఇంత నాటకీయ పరిణామాలు జరుగుతున్నా కానీ బీజేపీనే ప్రజలు గెలిపిస్తున్నారు. కానీ పాలించే దగ్గరే బీజేపీకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఏ ఒక్క నేత ఐదేళ్లు నీట్ గా పాలించడం లేదు. ముఖ్యమంత్రిగా ఏ మచ్చ లేకుండా కొనసాగడం లేదు. ఇప్పుడు యడ్డీ స్థానంలో సీఎం అయ్యే వ్యక్తి అయినా ఐదేళ్లు ఉంటాడా? లేదా? అన్నది వేచిచూడాలి.