Begin typing your search above and press return to search.

ఆ పట్టణమంతా పెళ్లికాని బ్యూటీలే ఏం చేస్తారంటే?

By:  Tupaki Desk   |   30 March 2021 10:43 AM GMT
ఆ పట్టణమంతా పెళ్లికాని బ్యూటీలే ఏం చేస్తారంటే?
X
ఆ పట్టణంలో అమ్మాయిలు అందంగా ఉంటారు. కానీ ఎందుకో పెళ్లికి దూరంగా ఉంటారు. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజం. దేశంలో ఆడపిల్ల అని తెలియగానే కడుపులో.. పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇప్పుడు అమ్మాయిల కొరతతో అబ్బాయిలకు పెళ్లి కాని పరిస్థితి నెలకొంది. మన దేశంలో కేరళలో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లో అమ్మాయిల సంఖ్య తక్కువే ఉంది.అయితే ఇక్కడికి రివర్స్ గా బ్రెజిల్ లోని నోవియా డోకోర్డీరోలో అబ్బాయిల సంఖ్య బాగా తక్కువ. అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. దాంతో ప్రతీ సంవత్సరం పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది.

పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు స్థానికంగా ఎక్కువ మంది ఉండగా.. అబ్బాయిల సంఖ్య ఆ స్థాయిలో లేదు. ఒక్కో అబ్బాయి.. ఒక్కో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఇంకా చాలా మంది అమ్మాయిలు మిగిలిపోతున్నారు. మాకెప్పుడు పెళ్లవుతుందో అనుకుంటూ చాలా మంది అమ్మాయిలు ఒంటరిగా బతికేసేందుకు సిద్ధపడుతున్నారు.

బ్రెజిల్ లోని నోవియా డోకోర్డీరోలో పట్టణంలో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఇక్కడే ఉంటారు. ఎక్కడికి వెళ్లరు. అది ఈ టౌన్ సంప్రదాయం. అందువల్ల చాలా మంది స్థానిక అబ్బాయిలనే పెళ్లి చేసుకుంటారు. స్థానిక అబ్బాయిలు దొరకకపోతే పెళ్లి లేకుండా అలాగే ఉంటున్నారు.

ఈ టౌన్ లోని 600 మంది జనాభాలో 300 మంది అమ్మాయిల వయసు 18 నుంచి 30 మధ్యే ఉంది. ఇందులో 300 మంది పెళ్లీడుకు వచ్చినా స్థానికంగా అబ్బాయిల కొరత ఉంది. బయట వాళ్లను వీరు చేసుకోరు. చేసుకుంటే ఆ ఊళ్లోనే ఉండాలి. అది ఇష్టం లేక ఎవరూ వీళ్లను చేసుకోవట్లేదు. దాంతో ఒంటరి జీవితమే దిక్కవుతోంది. ఇంతటి వింత నగరం మనకూ ఉంటే మన దేశంలో అక్కడికే వాలిపోయి చేసుకునే వారు ఎంతో మంది కానీ.. బ్యాడ్ లక్.. మన మగాళ్లకు ఆ చాన్స్ లేదు.