Begin typing your search above and press return to search.

టీడీపీ స‌రే... ఎన్టీఆర్‌ కు వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   28 May 2023 12:39 PM GMT
టీడీపీ స‌రే... ఎన్టీఆర్‌ కు వైసీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే!
X
దివంగ‌త మ‌హానాయ‌కుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్‌ కు ఆ పార్టీ నాయ‌కులు నివాళుల‌ర్పిం చ‌డం.. ఏటా మ‌హానాడు పేరుతోస్మ‌రించుకోవ‌డం కామ‌నే.దీనిని త‌క్కువ చేయ‌డం లేదు. కానీ, వైసీపీ నాయ కులు కూడా.. ఎన్టీఆర్‌ కు నివాళుల‌ర్పించ‌డం.. విగ్ర‌హాల‌ కు పూల దండ‌లు వేయ‌డం వంటివి ఇప్పుడు చ‌ర్చ‌ కు వ‌స్తున్నాయి. బ‌ల‌మైన టీడీపీ అనుచ‌ర గ‌ణం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్న‌గారి శ‌త జ‌యంతిని వైసీపీ నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

ఉమ్మ‌డి కృష్ణాజిల్లా లోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ శాసనసభ్యులు మొండితో క జగన్ మోహన్ రావు స్థానిక వైసీపీ నేత‌లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావు గారికి నందిగామ నియోజకవర్గ ప్రజల తరపున, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో, కళాకారుడిగా సినీ నటనలో నందమూరి తారక రాము ని వైభవం అత్యంత విశిష్టమైనదని చెప్పారు. ఆయన జీవితంలో ప్రతి రంగంలోనూ చరిత మరువని ఘనతను సాధించిన నందమూరి తారక రాముడి శతజయంతి నాడు నివాళులర్పించటం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు సో.. ఇదీ సంగ‌తి. ఎంతైనా ఎన్నిక‌ల‌ కు ఏడాదేలో పే స‌మ‌యం ఉండ‌డం.. బ‌ల‌మైన టీడీపీ ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అన్న‌గారి ని వైసీపీ ఎమ్మెల్యే ఇలా వాడుకుంటున్నార‌ని అంటున్నారు.