Begin typing your search above and press return to search.
అవినాశ్ అరెస్టుపై సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 25 April 2023 9:27 AM GMTమాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ని సీబీఐ అరెస్టు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో అరెస్టు చేయొద్దంటూ ఎంపీ పెట్టుకున్న పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల పై విస్మయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. అరెస్టు చేసే అంశం పై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కచ్ఛితంగా వెల్లడించింది.
ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరుతో పాటు.. లిఖిత పూర్వక ప్రశ్నావళితో అవినాశ్ ను విచారించాలంటూ తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పూర్తి కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రబూడ్ జస్టిస్ పీఎస్ నరసింహతోకూడి ధర్మాసనం కీలక వ్యాఖ్యలుచేయటంతో పాటు హైకోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టటం గమనార్హం.
హైకోర్టు ఉత్తర్వుల్లో పరిణితి లేదని తొలుత ముందస్తు బెయిల్ ఆ తర్వాత ప్రశ్నావళి ఇచ్చి నిందితుడ్నిప్రశ్నించాలని అనుకోవటం.
ఇక పై ఇలానే చేయాలని నిందితులంతా అడిగితే.. పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశాన్ని ప్రస్తావించటం గమనార్హం. కేసు దర్యాప్తునకు ఇలాంటి మార్గదర్శకాలు పాటించాలా? అలా అయితే సీబీఐను మూసేసుకోవటమే మంచిదంటూ కాస్తంగా ఘాటుగా ఉన్నాయని చెప్పాలి. "తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు కలవరపరిచేలా ఉన్నాయి. నేర న్యాయ శాస్త్రాన్ని తిరగరాసేలా ఉన్నాయి" అని వ్యాఖ్యానించటం చూస్తే సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల పై దాని అభిప్రాయం ఏమిటన్నది అర్థమయ్యేలా చెప్పేసిందని చెప్పాలి.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీరి పిటిషన్ మీద విచారణ జరిపింది. టీ హైకోర్టు ఈ ఉదంతంలో అసాధారణ ఉత్తర్వులను జారీ చేసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
'ఈ తరహా ఆదేశాలు దర్యాప్తునకు హాని చేస్తాయి. దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాతపూర్వకంగా లేదంటే ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఇవ్వాలని ఆదేశించటం సరికాదు. ఇలాంటి ఉత్తర్వులు దర్యాప్తు పట్ల తీవ్ర దురభిప్రాయాన్ని ఏర్పర్చటానికి అవకాశాన్ని ఇస్తాయి' అని వ్యాఖ్యానించారు.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో హైకోర్టు ఇలాంటి ఉత్తర్వుల్ని జారీ చేయటం అవాంఛనీయం కాబట్టి కొట్టేస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ నెల 30లోపు ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాకలు కాస్తంత మార్పు చేసి జూన్ 30కు గడువు పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్టు పై ఆయన న్యాయవాది చేస్తున్న వాదనలపై సుప్రీం ధర్మాసనం అస్సలు అంగీకరించలేదు.
అవినాశ్ ను సీబీఐ అరెస్టు చేస్తుందని అనుకుంటున్నారా మీరు? అలా అయితే అరెస్టు చేయాలనుకుంటే చాలా రోజుల క్రితమే అరెస్టు చేసేదన్నారు. అంతేకాదు అరెస్టు చేయాలనుకుంటే చాలా కాలం క్రితమే చేసేదని ఈ కేసులో అత్యంత అప్రమత్తంగా సంయమనాన్ని పాటిస్తుందన్నారు. అవినాశ్ ను అరెస్టు చేయొద్దనటానికి హైకోర్టు సరైన సమర్థనల్ని చెప్పలేదన్న సుప్రీంకోర్టు ఈ తరహా ఉత్తర్వులను జారీ చేయకుండా ఉండాల్సిందన్న వ్యాఖ్యలు చేశారు.