Begin typing your search above and press return to search.
కశ్మీర్ లో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు ఏం చెప్పాయి?
By: Tupaki Desk | 23 Dec 2020 1:30 PM GMTఇటీవల జమ్ముకశ్మీర్లో నిర్వహించిన తొలి జిల్లా డెవలప్ మెంట్ మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల్లో పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) తన సత్తా చాటింది. ఎంతకీ ఈ పీఏజేడీ (సింఫుల్ గా అయితే గుప్కార్ టీం అనుకుందాం) అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఏపీలో తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లు రెండు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? నో అంటే నో చెబుతారు. కానీ.. కశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఫరూక్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్.. మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలతో పాటు మరికొన్ని చిన్న పార్టీలు కలిసి ఒక ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. దాని పేరే గుప్కార్.
మొత్తం 280 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ గుప్కార్ కూటమి 82 చోట్ల విజయం సాధిస్తే.. మరో 30 స్థానాల్లో అధిక్యతను సొంతం చేసుకుంది. బీజేపీ 52 స్థానాల్లో గెలుపొంది.. ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. మరో 18స్థానాల్లో విజయానికి చేరువగా ఉంది. ఈ లెక్కన చూస్తే.. కశ్మీర్ లో ఆ పార్టీ తన సత్తా చాటుతుందనే చెప్పాలి. జమ్ములో బీజేపీ తన పట్టును సాధిస్తే.. కశ్మీర్ లో గుప్కార్ తన తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. కాంగ్రెస్ 19స్థానాల్లో 38 స్థానాల్లో స్వతంత్రులు విజేతలుగానిలిచారు. మూడు స్థానాల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల జాతీయత మీద తలెత్తిన సందేహాలతో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. దీంతో.. కశ్మీర్ లోయలో తమకే పట్టు ఉందన్న విషయాన్ని గుపార్క్ తేల్చినట్లైంది. అయితే.. రెండు బలమైనప్రాంతీయ పార్టీలు ఏకమై.. జాతీయ పార్టీపై పోరాడితే.. ఆ మాత్రం ఫలితం రాకుండా ఉంటుందా?