Begin typing your search above and press return to search.
ఈటల సందేహానికి బీజేపీ పెద్ద క్లారిటీ ఏమిచ్చారు?
By: Tupaki Desk | 1 Jun 2021 4:30 AM GMTసుదీర్ఘకాలం ఒక పార్టీలో ప్రయాణించి.. అనూహ్య పరిణామాల మధ్య ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని గడ్డు పరిస్థితులు ఇప్పుడు ఆయన ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటివేళ.. సొంతంగా పార్టీ పెట్టటమా? బీజేపీలో చేరటమా? అన్న డైలమాలో ఉన్న ఆయన.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతల్ని భేటీ కావటం.. తన మనసులోని సందేహాల్ని తీర్చుకోవటంతో పాటు.. తనకేం కావాలన్న విషయాల్ని ఆయన వారి ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల.. తన మనసులోని పలు సందేహాల్ని ఆయన ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ప్రచారంలో ఉన్న వాదనల్ని చర్చలోకి తీసుకురావటం ద్వారా.. బీజేపీ పెద్దల ఆలోచన ఏముందన్న విషయాన్ని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. పైకి తిట్టుకున్నా.. లోపల మాత్రం టీఆర్ఎస్.. బీజేపీలు కలిసే ఉంటాయన్న వాదన ఒకటి తరచూ ప్రచారానికి వస్తూ ఉంటుంది. ఇదే సందేహాన్ని తాజాగా ఆయన నడ్డా ఎదుట ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తొలుత కేంద్ర ప్రభుత్వ పథకాల్నికేసీఆర్ తిడతారు.. తర్వాత అమలు చేస్తారని.. బీజేపీని నమ్మి పార్టీలో చేరిన తర్వాత ఫ్యూచర్ లో టీఆర్ఎస్ తో చేతులు కలిపితే.. తమ లాంటి వారి పరిస్థితి ఏమిటన్న సందేహాన్ని ఈటల వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటే.. పులుసులో ములక్కాయ మాదిరి మారతామన్న ఆయన సందేహానికి నడ్డా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాల నుంచి అధికారాన్ని చేపట్టే స్థాయికి చేరుకున్నామని.. తెలంగాణలో టీఆర్ఎస్ తోరాజీ లేని పోరునే చేస్తామని.. పశ్చిమ బెంగాల్ కు మించిన దూకుడును ప్రదర్శిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కారుపై బోలెడన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా.. కేంద్రం ఏ ఒక్క దానిపైనా విచారణ చేయకపోవటం ఏమిటన్న ప్రశ్నకు స్పందించిన నడ్డా.. టీఆర్ఎస్ సర్కారు అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తాను బీజేపీలోకి చేరితే.. పులుసులో ములక్కాయ మాదిరి కాను కదా? అన్న సందేహానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి.