Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వద్దు .. అధికారులను చూసి 80 ఏళ్ల బామ్మ ఏం చేసిందంటే ?

By:  Tupaki Desk   |   3 Jun 2021 11:30 AM GMT
వ్యాక్సిన్ వద్దు .. అధికారులను చూసి 80 ఏళ్ల బామ్మ ఏం చేసిందంటే ?
X
దేశంలో శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికీ కొంతమందికి వ్యాక్సిన్‌ పై భయాందోళనలు పోవడంలేదు. తాజాగా ఓ 80 ఏళ్ల బామ్మ వ్యాక్సిన్‌ వేస్తారని భయపడి ఇంట్లోనే దాక్కొని , బయటకి రాలేదు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎటావా జిల్లాలోని చంద‌న్‌ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే స‌రిత బ‌దౌరియాతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు క‌రోనా వ్యాక్సిన్‌ పై అవ‌గాహ‌న క‌ల్పించి, వ్యాక్సిన్ ఇచ్చేందుకు చంద‌న్‌పూర్ గ్రామానికి మంగ‌ళ‌వారం వెళ్లారు. అయితే చాలామంది స్వ‌చ్ఛందంగా టీకా తీసుకున్నారు.

కానీ ఓ 80 ఏండ్ల బామ్మ హర్ దేవీ మాత్రం ఇంటి త‌లుపు వెనుకాల దాక్కుని టీకా తీసుకునేందుకు నిరాకరించింది. టీకా తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ద‌గ్గ‌రికి వెళ్ల‌గా, అక్క‌డే ఉన్న పెద్ద డ్ర‌మ్ము వెనుకాల‌ దాక్కుని రానంటే , రాను అని అక్కడే కూర్చుంది. దీంతో ఓ మ‌హిళా వైద్యురాలు బామ్మ ఇంట్లోకి వెళ్లి, మీ ఎమ్మెల్యే పిలుస్తున్నారు.. బ‌య‌ట‌కు రా అని బ‌తిమలాడింది. త‌న వ‌ద్ద ఎలాంటి ఇంజెక్ష‌న్ లేద‌ని , తర్వాత ఆ వృద్ధురాలు బ‌య‌ట‌కు వ‌చ్చి ఎమ్మెల్యేతో మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే స‌రిత మాట్లాడుతూ.. క‌రోనా టీకా ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. టీకా వేసుకుంటే జ్వ‌రం వ‌స్తుంది అని ఆమెకు ఎవ‌రో చెప్పార‌ని, అందుకే టీకా వేసుకునేందుకు ఆమె భయపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఒక్క బామ్మ తప్ప.. ఆ గ్రామంలోని వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు వెల్ల‌డించారు.