Begin typing your search above and press return to search.
ఆ బంగ్లా తో రాహుల్ కి ఉన్న అనుబంధం అలాంటిది మరి !
By: Tupaki Desk | 28 March 2023 7:00 PM GMTఆయనో ప్రధానమంత్రికి మునిమునవడు.. మరో ప్రధానమంత్రికి ముద్దుల మనవడు.. మరో ప్రధానమంత్రికి కుమారుడు.. ప్రధానమంత్రి పీఠాన్ని శాసించిన ఓ శక్తిమంతమైన నాయకురాలికి కొడుకు.. నాలుగు సార్లు ఎంపీ.. అన్నిటికి మించి వారి కుటుంబంలో ఇద్దరు ప్రధానులు దేశం కోసం ప్రాణాలర్పించారు. అలాంటి వ్యక్తికి అనుకోని పరిస్థితుల్లో దేశ రాజధానిలో బంగ్లా (నివాసం) ఖాళీ చేయాల్సిన సమయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి మరీ వ్యవహరించినట్లుగా ఆయన్ను బయటకు పంపానులకుంటోంది.
ఇలా కోర్టు రెండేళ్ల శిక్ష విధించిందో లేదో.. అలా లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిని చేసి.. ఇంకోవైపు అధికారిక నివాసాన్నీ ఖాళీ చేయమని నెల రోజుల గడువిచ్చింది. ఇదంతా రాహుల్ గాంధీ విషయం ప్రధాని నరేంద్ర మోదీ కక్షకట్టి చేస్తున్నట్లుగానే తెలిసిపోతోంది. కాగా, లోక్ సభ సభ్యుడిగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమంటూ సోమవారం లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ కు లేఖ పంపిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆ లేఖపై రాహుల్ స్పందించారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని బదులిచ్చారు.
ఆ బంగ్లాతో ఎన్నో మధురానుభూతులు..
రాహుల్ గాంధీది ప్రధానుల కుటుంబం. ఆయన బాల్యం రేస్ కోర్స్ రోడ్ లోనే గడిచి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య అనంతరం 30 ఏళ్లుగా వారి కుటుంబం ఇతర అధికారిక పదువులేమీ చేపట్టలేదు. ఇక రాహుల్ 2004 నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన తల్లి సోనియా 1998 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నాలుగు సార్లు ఎంపీగా ప్రస్తుతం తాను ఉంటున్న బంగ్లాతో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని సెక్రటేరియేట్ కు సమాధానమిచ్చారు. అయితే, అధికారుల ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు.
ఉండేది ఎక్కడంటే..? మిగతా ప్రయోజనాలూ ఎత్తేస్తారా?
రాహుల్ ఎంపీగా 12 తుగ్లక్ లేన్ లోని బంగ్లాలో ఉంటున్నారు. ఇక్కడ చాలా మధుర జ్ఞాపకాలున్నాయని.. తన హక్కులకు భంగం కలగకుండా.. లేఖలో పేర్కొన్నట్లుగా వ్యవహరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఆయన వివరించారు. తన బాధ్యతగా బంగ్లాను ఖాళీ చేస్తానని రాహుల్ లేఖలో వెల్లడించారు.
కాగా, రాహుల్ కు మోదీలపై వ్యాఖ్యలతో దాఖలైన పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల లోక్ సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. నెల రోజుల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే 12- తుగ్లక్ లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలంటూ సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనే రాహుల్ స్పందించారు. మరోవైపు, లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ప్రయోజనాలన్నింటినీ కూడా అధికారులు పునఃపరిశీలిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.