Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ కు ముందు దిశ హత్యాచార నిందితుడు అలా చేశాడా
By: Tupaki Desk | 2 Oct 2021 6:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన పోలీసు అధికారులు పలువురు.. తమకు ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటివేళ.. తాజాగా విచారణకు ప్రత్యక్ష సాక్షి అబ్దుల్ రవూఫ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆతనో కొత్త విషయాన్ని వెల్లడించారు. కమిషన్ తరఫున న్యాయవాదులు పరమేశ్వర్.. విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన రవూఫ్.. దిశకు సంబంధించిన వస్తువుల్ని దాచిన ప్రదేశాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్ చెప్పటంతో పోలీసులతో పాటు తాను కూడా చటాన్ పల్లికి వెళ్లానన్నారు.
దిశకు సంబంధించిన వస్తువుల్ని వెతికే క్రమంలో నిందితుడు ఆరిఫ్ రెండు చేతులతో మట్టి విసిరినట్లు చెప్పాడు. ఆ మట్టి అక్కడున్న పన్నెండు మంది కళ్లల్లో పడినట్లు చెప్పాడు. అనంతరం నిందితులు రాళ్లు.. కర్రలతో దాడి చేశారన్నారు. సీఐ.. ఎస్ ఐ ఆయుధాల్ని లాక్కునేందుకు నిందితులు ఆరిఫ్.. చెన్నకేశవులు లాక్కునే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదన్నారు.
కాల్పులుజరిగిన సమయంలో ఎంత దూరంలో ఉన్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. మూడు.. నాలుగు అడుగులదూరంలో ఉన్నారన్నారు. కాల్పుల వేళ ఏ వైపుఉన్నారంటూ రవూఫ్ ను అడిగితే.. తూర్పున అని చెప్పగా.. న్యాయవాది పశ్చిమం అని చెప్పటం.. ఆ వెంటనే రవూఫ్ మాట మార్చారు. దీంతో.. సదరు న్యాయవాదిపై కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్ కౌంటర్ కు ముందు దిశ హత్యాచార నిందితులు ఇసుకను కళ్లలో జల్లి దాడికి యత్నించారన్న మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు చర్చకు రాని ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.