Begin typing your search above and press return to search.
కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చు మాటేంటి? భారం ఎవరి మీదా?
By: Tupaki Desk | 7 May 2023 4:00 PM GMTయావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం ముగిసింది. ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పటికీ.. రాజరికానికి ఇవ్వాల్సినంత గౌరవ మర్యాదల్ని ఇస్తూ.. శతాబ్దాల నాటి సంప్రదాయాల్ని పాటించే విలక్షణ దేశంగా బ్రిటన్ ను చెప్పాలి. ఇటీవల కాలంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. తాజాగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి చేసిన ఏర్పాట్లు.. పెట్టిన ఖర్చు లెక్కఆసక్తికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ దేశాల వారు ఆసక్తిగా చూసిన పరిస్థితి.
ఆర్భాటంగా అంతకు మించిన విలాసవంతంగా నిర్వహించిన పట్టాభిషేక కార్యక్రమం గురించి ఇప్పుడు బోలెడన్ని స్పందనలు వస్తున్నాయి. ఓవైపు ప్రజలు పెరిగిన ధరలు.. ద్రవ్యోల్బణంతో తెగ ఇబ్బంది పడుతుంటే ఇలాంటి వేళ.. ఇంత భారీగా.. వైభవంగా పట్టాభిషేక కార్యక్రమాన్నినిర్వహించాలా? అన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే.. పట్టాభిషేకానికి భారీగా ఖర్చు అయినప్పటికీ.. అదేం పెద్ద విషయం కాదన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. మరికొందరు అయితే.. పెట్టిన ఖర్చు మొత్తం వడ్డీతో సహా తిరిగి వస్తుందన్న మాట కొర్పారేట్ ప్రపంచంలో లెక్కలు వేస్తున్నారు.
అర్భాటంగా నిర్వహించిన పట్టాభిషేక కార్యక్రమం కోసం దగ్గర దగ్గర రూ.515 కోట్ల నుంచి రూ.1030 కోట్ల వర కు ఖర్చు అయి ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఇంత భారీ మొత్తాన్ని ఎలా సమకూరుస్తారు? ప్రజల నుంచి వసూలు చేసే పన్ను ఆదాయంతోనే ఖర్చు చేయటాన్ని బ్రిటన్ రాజధాని లండన్ కు చెందిన 52 శాతం మంది ససమేమిరా అనటం గమనార్హం. పన్ను చెల్లింపుదారుల సొమ్మును దీని కోసం ఎందుకు నిర్వహిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
తామున్న గడ్డు పరిస్థితుల్లో ఇంత భారీ ఖర్చు అవసరం లేదన్న మాట పలువురి నోట వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం కారణంగా మేలు జరుగుతుందా? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఖర్చు పెట్టే డబ్బే.. మళ్లీ డబ్బును తీసుకొస్తుందన్న సిద్ధాంతంలో చూస్తే.. ఈ భారీ పట్టాభిషేక కార్యక్రమం కారణంగా దేశానికి మేలు జరుగుతుందంటున్నారు. పట్టాభిషేకాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాజధానికి రావటంతో అతిథ్య రంగంతో సహా పలు వ్యాపారాలకు మేలు జరుగుతుందంటున్నారు.
కొవిడ్ తో గాడి తప్పిన వ్యాపారాలకు పట్టాభిషేకం మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టాభిషేకం రోజున సెలువుగా ప్రకటించినందున.. అతిధ్య రంగంలో రూ.3500 కోట్లకు పైగా వ్యాపారం జరిగి ఉంటుందంటున్నారు. మొత్తానికి పట్టాభిషేక కార్యక్రమం ముగియటం.. పెట్టిన భారీ ఖర్చు సంగతి.. తిరిగి వచ్చిన ఆదాయం సంగతి ఎలా ఉన్నా.. ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమం లండన్ వీధుల్లో హడావుడికి కారణమైందని మాత్రం చెప్పక తప్పదు.