Begin typing your search above and press return to search.

ఆ టికెట్ నాకివ్వండి స‌ర్‌.. మంత్రి వ‌ర్యుల విన్న‌పం!?

By:  Tupaki Desk   |   25 Jun 2023 7:00 AM GMT
ఆ టికెట్ నాకివ్వండి స‌ర్‌.. మంత్రి వ‌ర్యుల విన్న‌పం!?
X
ఎన్నిక‌ల‌ కు స‌మ‌యం స‌మీపిస్తోంది. దీంతో నాయ‌కులు అలెర్ట్ అవుతున్నారు. త‌మ‌కు టికెట్ ఇవ్వాలంటే.. త‌మ వారికి కూడా టికెట్ ఇవ్వాల‌ని పోరు పెడుతున్న వారు అధికార పార్టీ వైసీపీ లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గాలు మార్చే మంత్రి ఆదిమూల‌పు సురేష్ కొన్ని నెల‌లుగా.. కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం పై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఆయ‌న సీఎం జ‌గ‌న్ దృష్టికి కూడా తీసుకువ చ్చార‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం ఎర్ర‌ గొండ‌ పాలెం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూల‌పు సురేష్‌.. గ‌తంలో అంటే.. 2014లో వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌ కు ఒక నియోజ‌క‌వ‌ర్గం అంటూ.. ప‌ర్మినెంట్‌ గా లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కూడా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోరు. పైగా.. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా.. ఆయ‌న అస్స‌లు వినిపించుకోరు. దీంతో ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గానికి మ‌ధ్య పెద్ద‌గాసంబంధం ఉన్న‌ట్టు క‌నిపించ‌దు.

ఇదే ప‌రిస్థితి ఎర్ర‌గొండ‌పాలెం లోనూ క‌నిపిస్తోంది. మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ కు వ్య‌తిరేకంగా ఇక్క‌డ ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. అయినా.. మంత్రి మాత్రం ఎవ‌రి నీ ప్రోత్స‌హించ‌డంలేదు. ఎవ‌రి నీ విమ‌ర్శించ డం లేదు. అయితే..తెర‌వెనుక మాత్రం త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గం మార్చాలంటూ.. సీఎం జ‌గ‌న్‌ ను కోరుతున్న ట్టు వైసీపీ వ‌ర్గాల్లో మాత్రం ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జిల్లా లోని మ‌రో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కొండ‌పి. ఇక్క‌డ వ‌రుస‌గా టీడీపీ నేత బాల వీరాంజ‌నేయ స్వామి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు.

ఇటీవ‌ల కాలం లో ఆయ‌న వైసీపీ పై తీవ్ర‌స్తాయిలో పోరాటం చేస్తున్నారు. టీడీపీ వాయిస్‌ ను కూడా బ‌లం గా వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాల వీరాంజ‌నేయ‌స్వామి ని ఓడించాల‌నేది వైసీపీ వ్యూహం. అయితే.. ఇక్క‌డ వైసీపీకి స‌రైన అభ్య‌ర్థి లేకుండా పోయారు. ఉన్న నాయ‌కులు కూడా ఎవ‌రికివారే అన్న‌ట్టుగా త‌యార‌య్యారు. ఈ ప‌రిణామాల‌ ను గుర్తించి మంత్రి ఆదిమూల‌పు సురేష్ త‌న‌ను కొండ‌పికి పంపించాల‌ని కోరుతున్నారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం.. ఆచి తూచి అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు తాడేప‌ల్లి కి చెందిన కీల‌క నాయ‌కులు. మ‌రి మంత్రి పంతం నెర‌వేరేతుందో లేదో చూడాలి.