Begin typing your search above and press return to search.

రామోజీ సీఐడీ విచారణ పై 'ఈనాడు' ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   4 April 2023 10:07 AM GMT
రామోజీ సీఐడీ విచారణ పై ఈనాడు ఏం చెప్పింది?
X
మార్గదర్శి చిట్ ఫండ్ పై గడిచిన కొద్ది రోజులు గా నడుస్తున్న హడావుడి తెలిసిందే. ఇప్పటికే మార్గదర్శి ప్రధాన కార్యాలయం.. జిల్లాల్లో ని బ్రాంచులు.. బ్రాంచ్ మేనేజర్ల,ను విచారించటం.. దీని కోసం పని చేసే ఆడిటర్ ను అదుపులోకి లాంటి పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. సోమవారం జూబ్లీహిల్స్ లోని రామోజీరావు పెద్ద కొడుకు కిరణ్ నివాసంలో రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించటం తెలిసిందే.

బెడ్ మీద ఉన్న రామోజీని వైద్యుల పర్యవేక్షణలో సీఐడీ అధికారులు విచారణ జరిపారు. ఈ కేసు విచారణలో భాగంగా రామోజీకి వారం క్రితం నోటీసులు ఇవ్వగా.. దీని కోసం ఆయన జూబ్లీహిల్స్ (రామోజీరావుకు ఫిలింసిటీలో ఇల్లు ఉంది) కు వచ్చారు. దీనికి సంబంధించిన ఈనాడు సంస్థ విచారణ జరిగిన వివరాల్ని వెల్లడించింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం చూస్తే..

విచారణ కోసం సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో 23 మందితో కూడిన టీం సోమవారం ఉదయం 10.30 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. 11.30గంటలకు విచారణ మొదలైంది. అయితే విచారణ మొదలైన గంటకే రామోజీరావు అలసటకు గురైనట్లుగా కన్పించటంతో. వైద్యుల సూచన మేరకు విచారణను కాసేపు ఆపారు. ఆ సమయంలో ఆయనకు వ్యక్తిగతంగా వైద్య సేవల్ని అందించే ఫ్యామిలీ డాక్టర్ ఎం.వీ. రావు ఆయన్నుపరీక్షించారు.

కాసేపు విచారణను నిలిపిన తర్వాత మధ్యాహ్నం 2.30గంటల వేళలో విచారణను తిరిగి ప్రారంభించిన అధికారులు సాయంత్రం5.30గంటల వరకు విచారణ చేపట్టారు. కాకుంటే.. అధికారులు మాత్రం 7.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. తాము నమోదు చేసిన కేసుకు సంబంధించిన పలు ప్రశ్నల్ని అడిగారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ రామోజీ రావు సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

రామోజీ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తామని. అవసరమైతే అదనపు సమాచారం కోసం మరోసారి విచారణకు వస్తామని సీఐడీ విచారణ అధికారి పేర్కొన్నారు. ఎలాంటి అదనపు సమాచారం కావాల్సి ఉన్నా రాతపూర్వకంగా అడిగి.. తగిన సమయం ఇస్తే.. తాము పంపుతామని పేర్కొన్నట్లుగా వెల్లడించారు. ఇదే కేసులో మార్గదర్శి ఎండీగా వ్యవహరిస్తున్న శైలజా కిరణ్ ను ఈ నెల ఆరున విచారించనున్నారు. రామోజీ విచారణ మొత్తం 5గంటల పాటు సాగింది. మొత్తం 46 ప్రశ్నలు వేసినట్లుగా పేర్కొన్నారు.

సీఐడీ టీం లోపలకు వచ్చినంతనే బెడ్ మీద చికిత్స తీసుకుంటున్నరామోజీ ఫోటోను తీసుకున్నారు. కాసేపటికే ఆ ఫోటో సాక్షి మీడియా సంస్థలో భాగమైన సాక్షి టీవీలో ప్రసారమైంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ అంశాన్ని సీఐడీ విచారణ అధికారులకు మార్గదర్శి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

విచారణ పేరుతో తీసిన ఫోటో బయటకు ఎలా వెళ్లిందంటూ ప్రశ్నించగా. వారు సమాధానం చెప్పలేదు. విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు తీసుకునే ఫోటో.. వీడియోలు విచారణకు నిమిత్తం మాత్రమే వినియోగించుకోవాలని. బయటకు పంపటం వ్యక్తిగత స్వేచ్ఛను హరించటం కిందకే వస్తుందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం.

మార్గదర్శికి సంబంధించిన సమాచారం ఆయా జిల్లాల్లోని బ్రాంచుల్లోనే ఉంటుందని. చట్టప్రకారం ఎప్పటికప్పుడు చిట్స్ ను పర్యవేక్షిస్తూ. రిజిస్ట్రార్లకు పంపుతామని ఎలాంటి అభ్యంతరాలు కానీ ఫిర్యాదులు కానీ రాలేదన్నారు. గడిచిన అరవై ఏళ్లుగా ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి విచారణ జరగటానికి కారణం.

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. ఆయన ప్రభుత్వంపై ఈనాడు నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తుందన్న కోపం. అక్కసుతో వ్యక్తిగతంగా తనపైనా మార్గదర్శిపైనా బురద జల్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని రామోజీ పేర్కొనగా. ఆ అంశాన్నితొలుత నమోదు చేయలేదు.

ఈ విషయాన్ని సీఐడీ అధికారులకు గుర్తు చేయటంతో. చివరకు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. విచారణకు సంబంధించిన వీడియో ఇస్తామని చెప్పి..చివరకు తమకు ఇవ్వకుండానే అధికారులు వెళ్లినట్లుగా ఈనాడు సంస్థ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.