Begin typing your search above and press return to search.

ఏంటి ఈయనకు బాబు అన్యాయం చేశారా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 8:30 AM GMT
ఏంటి ఈయనకు బాబు అన్యాయం చేశారా?
X
అదే అర్ధం కావటం లేదు ఎవరికీ. కానీ ఈయనను తలచుకున్నపుడల్లా అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. సబ్బంహరి వైజాగ్ ఆక్టోపస్ గా పాపులరైన సీనియర్ నేత. ఈమధ్య కాలంలో రాజకీయాల్లో కన్నా మీడియాలో విశ్లేషకుడి అవతారంలోనే ఎక్కువగా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు, విమర్శలు చేయటంలో చాలా కాలంగా ఈ నేతే అందరికన్నా ముందుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపైన అంశాల వారిగా విమర్శలు చేస్తుంటారు. ఆయన చెప్పే విశ్లేషణలు ఎంతమంది నమ్ముతారన్నది వేరే విషయం. చెప్పటానికి సబ్బం రెడీగా ఉంటారు.

ఈయన్ను చూపించటానికి చంద్రబాబు మద్దతుమీడియా రెడీగా ఉంటుంది. ఇంతకన్నా ఇంకేమి కావాలి ఈ వైజాగ్ ఆక్టోపస్ కు. ఏబిఎన్, టీవీ5, మహాటీవీ లాంటి టీవీ చర్చల్లో ఈమధ్య కాలంలో టీడీపీ నేతల్లో అందరికన్నా ఎక్కువగా కనబడుతున్నదెవరయ్యా అంటే ఠక్కున సమాధానం చెప్పేస్తారు సబ్బంహరి అని.

ఇటువంటి నేతకు చంద్రబాబు అన్యాయం చేశారట. ఎలాగయ్యా అంటే పార్టీ తరపున నియమించిన ఏ కమిటిలో కూడా చోటు కల్పించకపోవటం ద్వారానట. పొలిట్ బ్యూరోలో కానీ, జాతీయ కమిటిలో కానీ సబ్బం పేరు ఎక్కడా కనబడలేదు. మరి తొందరలోనే నియమించబోయే రాష్ట్ర కమిటిలో అయినా సబ్బం పేరు కనబడుతుందో లేదో డౌటేనట. ఇంతకీ చంద్రబాబుకు ఫ్రంట్ వారియర్ లాగ పనిచేస్తున్న సబ్బం పేరు ఎందుకు కనబడలేదయ్యా అంటే దానికో రహస్యముందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదేమిటంటే అసలు సబ్బం టీడీపీ లీడరే కారట. సబ్బంకు టీడీపీలో ఎక్కడా మెంబర్ షిప్పు లేదని నేతలంటున్నారు. వినటానికి విచిత్రంగానే ఉన్నా అదే నిజమట.

మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ తరపున ఎవరు పోటీ చేయటానికి ముందుకు రాకపోతే చివరినిముషంలో సబ్బం పోటీ చేశారటంతే. పార్టీలో చేరకుండానే టీడీపీ బీఫారం మీద పోటీచేశారట. ఓడిపోగానే టీడీపీ నేత అనే ముసుగును తొలగించేసుకుని విశ్లేషకుని అవతారంలోకి మారిపోయారట. రాష్ట్రం మొత్తం మీద పోయిన ఎన్నికల్లో ఇటువంటి వెసులుబాటు దక్కింది కేవలం సబ్బంకు మాత్రమే అని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన కూడా తాను టీడీపీ నేతను అని ఎక్కడా చెప్పుకోవటం లేదట. అయితే జనాలు మాత్రం సబ్బంను టీడీపీ నేతగానే చూస్తున్నారు. ఇందుకోసమైనా చంద్రబాబు ఏదో కమిటిలో చోటు కల్పిస్తారని నేతలు కూడా అనుకున్నారట. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరి రాష్ట్ర కమిటిలో అయినా....