Begin typing your search above and press return to search.
సీబీఐకి ఏమి దొరికిందో ?
By: Tupaki Desk | 26 April 2023 3:00 PM GMTవివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటోంది. హత్య జరిగిన నాలుగున్నరేళ్ళకు ఇళ్ళల్లో సోదాలు చేస్తే ఏమి దొరుకుతుంది ? సోమ, మంగళవారం పులివెందులలో సీబీఐ అధికారుల బృందం క్యాంపు వేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి ఇళ్ళల్లో విస్తృతంగా గాలించిందట. హత్య జరిగింది 2019 మార్చిలో. ఎప్పుడో హత్య జరిగితే ఇపుడు గాలింపు చేయటంలో దర్యాప్తు అధికారుల ఆలోచన ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు.
జరిగిన హత్య వివేకా ఇంట్లో అయితే అవినాష్ ఇంటిని ఎందుకు వెదికారో తెలీటం లేదు. వివేకా ఇంటిని గడచిన నాలుగున్నరేళ్ళుగా సీజ్ లోనే ఉంచుంటే ఏమన్నా దొరికే అవకాశం ఉంటుందేమో తెలీదు.
అప్పట్లోనే సోదాలు చేసినపుడు ఏమి దొరికిందో సీబీఐ ప్రకటించలేదు. ఎంపీ కాబట్టి అవినాష్ ఇంటికి ప్రతిరోజు వందలసంఖ్యలో విజిటర్స్ వచ్చి పోతుంటారు. వందలమంది వచ్చిపోయే ఇంట్లో ఏమి దొరుకుతుందని సీబీఐ విస్తృతంగా గాలించిదో అర్ధంకావటం లేదు. సోదాల్లో అవినాష్ ఇంట్లో ఏమైనా దొరికిందా లేదా కూడా తెలీదు.
అలాగే వివేకా కూతురు డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని సీబీఐ తాజాగా విచారించింది. సునీతను విచారించిటం మొదటిసారైతే నర్రెడ్డిని రెండోసారి విచారించింది. ఒకవైపేమో సునీత, నర్రెడ్డి దంపతులకు హత్యతో ఎలాంటి సంబంధంలేదని సీబీఐ తేల్చేసింది. ఇదే విషయాన్ని సుప్రింకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది.
హత్యకు సంబంధించి వారినుండి తీసుకోవాల్సిన వివరాలను అన్నింటినీ ఇప్పటికే అనేకసార్లు మాట్లాడి తీసుకుంది. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ప్రత్యేకించి వీళ్ళిద్దరినీ ఎందుకు విచారించిందో తెలీటంలేదు.
వివేకా రెండో భార్య షమీమ్ దగ్గర కూడా సీబీఐ రెండోసారి స్టేట్మెంట్ తీసుకున్నదట. మొదటి స్టేట్మెంట్ లో కూడా షమీమ్ తన భర్త వివేకా హత్యలో సునీత, నర్రెడ్డకి పాత్రుందని ఆరోపించారు. మొదటిసారి స్టేట్మెంట్ లో షమీమ్ ఆరోపణలు చేసిన తర్వాతే హత్యలో వీళ్ళపాత్ర లేదని సీబీఐ సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవైపు వీళ్ళపాత్ర లేదని తేల్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎందుకు విచారించిందో తెలీటంలేదు. మొత్తానికి కాలం గడిచేకొద్దీ వివేకా హత్యకేసు గందరగోళంగా తయారవుతోంది.