Begin typing your search above and press return to search.
లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడిని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అడ్డుకున్నారా?
By: Tupaki Desk | 11 Dec 2021 6:30 AM GMTఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే మాటలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. సోషల్ మీడియా.. వాట్సాప్ లో సమాచారం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం.. తెలిసిన విషయాన్ని ఎవరికి వారు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ వార్తలుగా మలుచుకుంటూ వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్యన ఎక్కువైంది. ఇక.. యూట్యూబ్ ఛానళ్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్న విజువల్ ను తమకు తోచినట్లుగా అన్వయించుకోవటం అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. ఇప్పుడు లేని విషయాల్ని ఉన్న విషయంగా చెప్పేసే ధోరణి ఈ మధ్య తీవ్రతరమైంది.
తాజాగా ఏపీ రిటైర్డు ఐఏఎస్ అధికారి.. చంద్రబాబుకు ఓఎస్డీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ఇంటికి ఏపీ సీఐడి అధికారులు శుక్రవారం ఉదయం రావటం.. తనిఖీలు చేసే సందర్భంలో వాదులాట జరగటం లాంటివి తెలిసిందే. అయితే.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఆయన ఇంటికి వెళ్లి.. ఏపీ సీఐడి అధికారుల్ని అడ్డుకున్నారంటూ అనవసరమైన ప్రచారం జరిగింది. వాస్తవంగా చూస్తే.. అక్కడ జరిగింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మాత్రం మరొకటిగా చెప్పొచ్చు.
అప్పటికే కొన్ని టీవీ ఛానళ్లు.. యూట్యూబ్ చానళ్లు తమకు తోచిన రీతిలో విషయాన్ని అల్లేసి.. అడ్డదిడ్డం వ్యాఖ్యలతో విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. కొందరైతే మరింత ముందుకు వెళ్లి.. తమ ఊహలకు రెక్కలు తొడిగేసి.. అవన్నీ వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి ప్రవేశించే వేళలో ఏపీ సీఐడీ అధికారులు గేట్లను తోసేశారని.. వారి విసురుకు అవి దెబ్బ తిన్నాయని.. ఇంటి తలుపుల్ని బద్ధలు కొట్టారన్న పిచ్చ మాటలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
కానీ.. అలాంటిదేమీ జరగలేదు. మరి.. ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా వ్యవహరిస్తున్న వేమూరి రాధాక్రిష్ణ ఎపిసోడ్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆయనకు.. సమాచారం అందటం.. లక్ష్మీనారాయణ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. దీంతో.. ఆయన ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో లక్ష్మీనారాయణకు.. ఆయన కుటుంబ సభ్యులతో ఏపీ సీఐడీ అధికారులు వాగ్వాదం జరుగుతోంది.అప్పుడే ఆంధ్రజ్యోతి ఆర్కే ఇంట్లోకి వెళ్లి.. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు.
ఆయన మాటలకు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కాస్త తగ్గి.. ఏపీ సీఐడీ అధికారులు తమ విధుల్ని నిర్వర్తించే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఆయన తన దారిన తాను వెళ్లేందుకుసిద్ధమవుతుంటే.. ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను.. అక్కడే ఉండాలని మరీ మరీ అడిగినట్లుగా తెలుస్తోంది.
‘ఇప్పటివరకు ఆయన సహకరించలేదు. మీరు వచ్చిన తర్వాత.. మీ మాటలతో ఆయన తీరు మారింది. దయచేసి మీరు మరికాసేపు ఇక్కడే ఉండండి. మా పని చాలా తేలిక అవుతోంది’ అని అధికారులు ఆర్కేను కోరటంతో.. ఆయన కాదనలేక అక్కడ ఉండిపోయినట్లుగా చెబుతున్నారు.
ఆ మాటకు వస్తే.. ఆర్కే కానీ అక్కడకు వెళ్లకపోతే మరింత రభస జరిగేదని.. ఆయన ఎంట్రీతో విషయం వెంటనే ఒక కొలిక్కి రావటంతో పాటు.. అనవసరమైన పరిణామాలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే.. అందుకు భిన్నమైన ప్రచారాలు.. యూట్యూబ్ వీడియోలు బయటకు రావటం గమనార్హం.
ఈ ఉదంతాన్ని చూసినప్పుడు.. మసాలా వార్తలు.. లేనిది ఉన్నట్లుగా.. అందరూ ఆసక్తిగా చదివేందుకే ప్రాధాన్యత ఇవ్వటం తప్పించి.. వాస్తవంగా అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకొని.. ప్రజలకు తెలియజేసే బాధ్యతను వారు మర్చిపోయినట్లుగా చెప్పక తప్పదు.