Begin typing your search above and press return to search.
ఇది..చంద్రబాబు చేయాల్సిన చాలెంజ్
By: Tupaki Desk | 13 Dec 2021 6:05 AM GMTప్రత్యేకహోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం వైసీపీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామాలు చేయించాలని చంద్రబాబునాయుడు చాలెంజ చేసిన విషయం అందరికి తెలిసిందే.
అయితే చంద్రబాబు చేసిన చాలెంజ్ చాలా అవుట్ డేటెడ్ చాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐదేళ్ళ క్రితం ఇదే చాలెంజ్ ను జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎం చంద్రబాబుకు చేశారు. సరే జగన్ చాలెంజ్ ను చంద్రబాబు పట్టంచుకోకపోతే జగనే తన ఐదుగురు ఎంపీలతో రాజీనామాలు చేయించారు. అయితే అది దాదాపు ఉప ఎన్నికలు రాకుండా ఆలస్యంగా వ్యూహాత్మకంగా చేశారు.
కాబట్టి చంద్రబాబు ఇపుడు చేసిన చాలెంజ్ కొత్తదేమీ కాదు పాత చింతకాయ పచ్చడని అందరికీ అర్ధమైపోయింది. ఇపుడు చంద్రబాబు చేయాల్సిన చాలెంజ్ కొత్తగా ఉండాలి. ఆ చాలెంజ్ కూడా జగన్ను ఇరుకున పెట్టేదిగా ఉండాలి.
ఇంతకీ చంద్రబాబు చేయాల్సిన చాలెంజ్ ఏమిటంటే తన ఎంపీలతో రాజీనామాలు చేయించేయటమే. హోదా డిమాండ్ పైనే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించాలి. విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తెప్పించాలి.
రాజీనామాలు చేసిన వెంటనే లోక్ సభ స్పీకర్ తో మాట్లాడుకుని తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎంపీలపైనే ఉంది. ఒకసారి రాజీనామాలు ఆమోదం పొందితే ఉపఎన్నికలు తప్పవు.
షెడ్యూల్ ఎన్నికలకు ఎలాగు రెండున్నరేళ్ళుంది కాబట్టి కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా ఉపఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇపుడు రాజీనామాలు చేసిన ముగ్గురే మళ్ళీ పోటీచేస్తారనే అనుకోవాలి. మరీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారు ?
కచ్చితంగా ఉపఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్ధులను పోటీలోకి దింపాల్సిందే కదా. అప్పుడు ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారుతుంది. చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రభుత్వంపై జనాలంతా మండిపోతున్నది నిజమే అయితే, ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు చిత్తశుద్ది నిజమే అనుకుంటే జనాలు కచ్చితంగా టీడీపీనే గెలిపిస్తారు. అప్పుడు మూడు ఎంపీ సీట్లలో గెలవటం అన్నది నైతికంగా కూడా టీడీపీ నేతలకు పెద్ద బూస్పప్ లాగ పనిచేస్తుంది.
కాబట్టి ప్రత్యేకహోదా విషయంలో జనాలు అనుమానించకుండా ఉండాలంటే వెంటనే తన ఎంపీలతో రాజీనామాలు చేయించేయాలి. ఎంపీలతో రాజీనామాలు చేయించటమే జగన్ కు చంద్రబాబు విసరాల్సిన నిజమైన చాలెంజ్. చాలెంజ్ దెబ్బకు జగన్ ప్రభుత్వం ఏమైపోతుందో తేలిపోతుంది. మరి నిజమైన చాలెంజ్ విసిరేందుకు చంద్రబాబు సిద్ధమేనా ?